Dangerous Bike Stunts: నడిరోడ్డుపై యువకుడి డేంజరస్ బైక్ స్టంట్స్.. అరెస్ట్ చేసిన పోలీసులు
Dangerous Bike Stunts on Roads: రద్దీ రోడ్లపై డేంజరస్ బైక్ స్టంట్స్ ప్రదర్శిస్తూ వాహనదారులను బెంబేలెత్తిస్తున్న ఓ యువకుడిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
Dangerous Bike Stunts on Roads: బెంగళూరులో నడిరోడ్లపై బైక్ స్టంట్స్ ప్రదర్శిస్తూ ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమిస్తున్న ఓ యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని కారణంగా రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో అతనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. హోండా డియో బైక్‌పై నడి రోడ్డుపై స్టంట్స్ ప్రదర్శిస్తున్న అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఆ యువకుడిని విజయ్ (20)గా గుర్తించారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం విజయ్ ఈ స్టంట్స్ చేస్తున్నట్లు గుర్తించారు. రద్దీగా ఉండే రోడ్లపై విజయ్ చేస్తున్న స్టంట్లతో వాహనదారులు భయభ్రాంతులకు గురవుతున్నట్లు పోలీసులు తెలిపారు. బైక్‌ను సీజ్ చేయడంతో పాటు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయ్ అరెస్టుతో బైక్ రేసర్స్‌కి, బైక్ స్టంట్స్ చేసేవారికి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది.
గతంలో హైదరాబాద్‌లోనూ పలువురు యువకులు ఇలా నడిరోడ్లపై బైక్ స్టంట్స్ ప్రదర్శిస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేని మైనర్లు బైక్స్‌తో రోడ్ల పైకి చేరి స్టంట్స్ ప్రదర్శించడం.. రేసింగుల్లో పాల్గొనడం అప్పట్లో తీవ్ర సంచలనం రేకెత్తించింది. గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్ మలక్‌పేటలో ఓ యువకుడు రద్దీగా ఉన్న రోడ్డుపై బైక్ స్టంట్స్ ప్రదర్శించాడు. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రోడ్లపై బైక్ స్టంట్స్ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నా అడపాదడపా అలాంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.
Also Read: Jaggareddy on Resignation: రాజీనామా నిర్ణయాన్ని వాయిదా వేసుకున్న జగ్గారెడ్డి.. కారణమిదే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook