CM KCR Birthday Offer: కేసీఆర్ జన్మదినం సందర్భంగా బంపర్‌‌ ఆఫర్ ఇచ్చిన బార్బర్‌‌!

Hyderabad Barber Offer: ఆయన కేసీఆర్ వీరాభిమాని... తన అభిమాన నేత పుట్టిన రోజు సందర్భంగా తనవంతుగా పేదలకు ఏదో ఒక సాయం చేయాలనుకున్నాడు.. అందుకే గత రెండేళ్లుగా పేదవారికి ఫ్రీగా కటింగ్‌.. షేవింగ్‌ చేస్తున్నాడు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2022, 08:55 PM IST
  • తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా సీఎం కేసీఆర్‌‌ బర్త్‌ డే వేడుకలు
  • కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బార్బర్ షాప్ ఓనర్‌‌ బంపర్ ఆఫర్
  • అందరికీ ఫ్రీ కటింగ్‌.. షేవింగ్‌
  • సీఎం కేసీఆర్ ఆదర్శమంటోన్న బార్బర్ షాప్ ఓనర్‌‌
CM KCR Birthday Offer: కేసీఆర్ జన్మదినం సందర్భంగా బంపర్‌‌ ఆఫర్ ఇచ్చిన బార్బర్‌‌!

Barber Offer On KCR Birthday: సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా కేసీఆర్‌‌ బర్త్‌ డే వేడుకలు ఎంతో అట్టహాసంగా జరిగాయి. అయితే కేసీఆర్‌‌ పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్‌లో ఒక కటింగ్‌ షాప్‌ ఓనర్ బంపర్ ఆఫర్‌‌ ఇచ్చాడు. మా సీఎం సాబ్‌ పుట్టిన రోజు సందర్భంగా అందరికీ ఫ్రీ కటింగ్‌.. షేవింగ్‌ అంటూ ప్రకటించాడు. 

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ బసవతారకం కేన్సర్‌‌ హాస్పిటల్‌కు సమీపంలో బ్యానర్స్ ఏర్పాటు చేసి.. సీఎం కేసీఆర్‌‌ బర్త్ డే సందర్భంగా షేవింగ్, కటింగ్‌ ఫ్రీగా చేశాడు. 

తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కష్టపడి.. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించినటువంటి యోధుడు కేసీఆర్‌‌ అని ఆ బార్బర్‌‌ షాప్‌ ఓనర్ పేర్కొన్నాడు. అంతేకాదు గత రెండేళ్లుగా కేసీఆర్‌‌ బర్త్‌ డే సందర్భంగా తాను తనవంతు పేదవాళ్లకు సాయం అందించాలనే ఉద్దేశంతో ఫ్రీగా కటింగ్.. షేవింగ్ చేస్తున్నానన్నారు.

ఇక కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుచి.. తెలంగాణ అభివృద్ధిపరంగా దూసుకెళ్తుందన్నారు. కేసీఆర్‌‌ బీసీల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారన్నారు. పేదలందరికీ అండగా నిలుస్తున్నాడని తెలిపారు. అలాంటి సీఎం కేసీఆర్ తనకు ఆదర్శమన్నారు. అందుకే ఆయన ప్రతి జన్మదినం సందర్భంగా తాను పేదవారికి ఫ్రీగా కటింగ్.. షేవింగ్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు.

Also Read: Viral Video: ఈ ఛాన్స్ పోతే మళ్లీ రాదన్నట్టు స్టెప్పేసిన నవ వధువు.. చూస్తే షాకే!!

Also Read: టీమిండియా స్టార్ బౌలర్‌కు వార్నింగ్.. ఇక ఆడకుంటే అంతేసంగతులు అన్న బీసీసీఐ! ఇషాంత్‌, ఉమేష్ మాదిరే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News