Bharat Bandh: CM Arvind Kejriwal under house arrest: న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా రైతుల భారత్ బంద్ (Bharat Bandh) ప్రశాంతంగా కొనసాగుతోంది. అన్ని విపక్ష పార్టీలు, రైతు, కార్మిక సంఘాలు రోడ్లపై భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు (Delhi Police) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ ( Arvind Kejriwal ) ను గృహ నిర్బంధంలో ఉంచినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ (APP) ట్వీట్‌ చేసింది. సీఎం ఇంట్లోకి వెళ్లేందుకు కానీ.. సీఎం బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు కానీ.. ఎవ‌రినీ అనుమ‌తించడం లేదని ఆప్ పేర్కొంది. దీంతోపాటు నిన్న సీఎంతో సమావేశమైన ఎమ్మెల్యేలు (AAP MLA's).. ఈ రోజు కలిసేందుకు వెళ్లగా పోలీసులు కొట్టారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌర‌భ్ భ‌ర‌ద్వాజ్ ఆరోపించారు. బీజేపీ నాయకులను సైతం ఆయన నివాసం బయట కూర్చోబెట్టారని సౌరభ్ భరద్వాజ్ (Saurabh Bharadwaj) ఆరోపించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేంద్రం అమల్లోకి తెచ్చిన వ్యవసాయ ( Farm laws ) చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సింఘు సరిహద్దు ( Singhu Border) లో గత 13రోజులుగా నిరసన చేస్తున్న రైతులను కేజ్రీవాల్ సోమవారం కలిసి మద్దతు ప్రకటించారు. సేవ చేయాల‌న్న ఉద్దేశంతోనే రైతుల్ని క‌లిసేందుకు వ‌చ్చానని, రైతుల వారి డిమాండ్లు వాస్త‌వ‌మైన‌వ‌ని కేజ్రీవాల్ చెప్పారు. ఇంటికి వచ్చినప్పటి నుంచి సీఎం కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచినట్లు సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. Also read: Bharat Biotech: కోవ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి దరఖాస్తు



ఇదిలాఉంటే.. సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచారన్న విషయంపై నార్త్ డీసీపీ ఆంటో ఆల్ఫోన్స్ (Anto Alphonse) స్పందించారు. సీఎం కేజ్రీవాల్‌ను గృహ నిర్బంధంలో ఉంచలేదని.. ఆప్, ఇతర పార్టీల మధ్య ఉద్రిక్త పరిస్థితులను నివారించడానికి ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. Also read: Bharat Bandh: నేడు భారత్ బంద్.. కేంద్రం నుంచి రాష్ట్రాలకు సూచనలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook