SSR death case: మహా సర్కార్‌కి బీహార్ సర్కార్ నుంచి మరో షాక్
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది.
SSR death mystery: పాట్నా: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసులో ఒకదాని తర్వాత మరొకటిగా వరుస కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. సుశాంత్ మృతి కేసులో ఇప్పటికే అతడి అభిమానుల నుంచి. పలువురు బాలీవుడ్ ప్రముఖుల నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు ఎదుర్కొంటున్న మహారాష్ట్ర సర్కారుకి మరో షాక్ తగిలింది. సుశాంత్ మృతి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీసేలా సీబీఐ దర్యాప్తునకు ( CBI investigation ) ఆదేశించాలని సుశాంత్ తండ్రి చేసిన విజ్ఞప్తిపై బీహార్ సర్కార్ తక్షణమే స్పందించింది. సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందిగా బీహార్ ప్రభుత్వం ( Bihar govt ) సిఫార్సు చేసినట్టుగా ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన జనతా దళ్ యునైటెడ్ అధికార ప్రతినిథి సంజయ్ సింగ్ వెల్లడించినట్టు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ పేర్కొంది. Also read: Sushant death case: సుశాంత్ మృతి కేసులో కీలక పరిణామం
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి గల అసలు కారణాలు తెలియాలంటే.. ఈ కేసులో సిబిఐ చేత దర్యాప్తు చేయించాలంటూ బీహార్ సర్కారుపై ఒత్తిడి తీవ్రమైంది. సుశాంత్ అభిమానులతో పాటు విపక్షాలు సైతం ఇదే డిమాండ్ చేస్తున్నాయి. దీనికితోడు తాజాగా సుశాంత్ తండ్రి సైతం ప్రభుత్వానికి అదే విజ్ఞప్తి చేయడంతో నితీశ్ కుమార్ ప్రభుత్వం ( CM Nitish Kumar ) సిబిఐ విచారణకు రికమెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. Also read: సుశాంత్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తిపై కేసు నమోదు
సుశాంత్ జూన్ 14న ఆత్మహత్య ( SSR suicide) చేసుకున్నప్పటి నుంచే ఈ కేసులో సీబీఐ విచారణ జరిపించాలని అతడి అభిమానులు పట్టుబడుతూ వస్తున్నప్పటికీ.. మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra govt ) మాత్రం అందుకు నో చెబుతూ వచ్చింది. ముంబై పోలీసులు కేసు విచారణను వేగవంతం చేశారని.. సీబీఐకి కేసు దర్యాప్తు బదిలీ చేసే ఉద్దేశమే లేదని మహారాష్ట్ర కేంద్ర మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. కానీ తాజాగా సుశాంత్ సొంత రాష్ట్రమైన బీహార్ సర్కార్ సైతం సీబీఐ విచారణకే మొగ్గుచూపుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర సర్కార్ ఏం నిర్ణయం తీసుకోనుందనేదే ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. Also read: Ram mandir: భూమి పూజ తొలి ఆహ్వానం అందుకుంటున్న ఇక్బాల్ ఎవరు ?