BJP: పాక్, చైనాలతో యుద్ధం ఎప్పుడనేది నిర్ణయమైపోయింది.
పాకిస్తాన్, చైనా దేశాలతో యుద్దం తేదీలు ఫిక్స్ అయ్యాయంటూ బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారని సైతం స్పష్టం చేశారు.
పాకిస్తాన్ ( Pakistan ) , చైనా ( China ) దేశాలతో యుద్దం తేదీలు ఫిక్స్ ( War dates fixed ) అయ్యాయంటూ బీజేపీ నేత చేసిన సంచలన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ప్రధాని మోదీ ( pm modi ) ఇప్పటికే ఈ విషయంలో నిర్ణయం తీసుకున్నారని సైతం స్పష్టం చేశారు.
ఉత్తరప్రదేశ్ బీజేపీ ఛీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ( Up bjp president Swatantra dev singh ) సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, చైనాలతో నెలకొన్న ఉద్రిక్తల నేపధ్యంలో ఆ దేశాలతో ఎప్పుడు యుద్ధం చేయాలనేది ముఖ్యంగా తేదీలు ఫిక్స్ అయిపోయాయని..ప్రధాని నరేంద్ర మోదీ ( Pm Narendra modi ) ఆ నిర్ణయం తీసుకున్నారని చెప్పడం ఆసక్తిగా మారింది.
అయోధ్యలో రామ మందిరం ( Ram mandir ) , కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు ( Article 370 ) తదితర అంశాల తరహాలోనే ప్రధాని మోదీ దీనిపై నిర్ణయం తీసుకున్నారని స్వతంత్ర దేవ్ సింగ్ తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే సంజయ్ యాదవ్ ఇంటి వద్ద నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడీ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ నేతలను ఉగ్రవాదులతో పోల్చారు. పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపేందుకే స్వతంత్ర దేవ్ ఆ వ్యాఖ్యలు చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
ఓ వైపు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జై శంకర్.. సరిహద్దులో ఉద్రిక్తతల్ని తగ్గించి..శాంతి నెలకొల్పుతామని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ యూపీ అధ్యక్షుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. భారత చైనా వాస్తవాధీన రేఖ వెంబడి ఇరు దేశాలు భారీగా సైన్యాన్ని మొహరించాయంటూ గతంలో ఓసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. Also read: Maharashtra: దమ్ము..ధైర్యముంటే ప్రభుత్వాన్ని పడగొట్టండి