Covid Vaccine Price: ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరల్ని మరోసారి ఖరారు చేసిన కేంద్రం
Covid Vaccine Price: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..ప్రైవేటు వ్యాక్సిన్‌పై కూడా స్పందించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై స్పష్టత ఇచ్చింది. నిర్దిష్ట ధరను ఖరారు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలిలా ఉన్నాయి..
Covid Vaccine Price: కరోనా వ్యాక్సినేషన్ విషయంలో కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం..ప్రైవేటు వ్యాక్సిన్‌పై కూడా స్పందించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధర విషయమై స్పష్టత ఇచ్చింది. నిర్దిష్ట ధరను ఖరారు చేసింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలిలా ఉన్నాయి..
కరోనా మహమ్మారి (Corona Pandemic) నియంత్రణకు ప్రస్తుత తరుణంలో వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గంగా ఉంది. దేశంలో ఓ వైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. మరోవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( PM Narendra Modi) వ్యాక్సిన్ విషయంలో కీలక ప్రకటన చేశారు.18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని ప్రకటించారు. అదే సమయంలో ప్రైవేటు వ్యాక్సిన్ విషయంలో కూడా స్పందించారు. ప్రైవేటుగా వ్యాక్సిన్ వేసుకోవాలనుకునేవారు వేసుకోవచ్చని సూచించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వ్యాక్సిన్ ధరలపై కేంద్ర ప్రభుత్వం (Central government) స్పష్టతనిచ్చింది. నిర్ధిష్ట ధరను విధిస్తూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర ఒక్కొక్క డోసు 780 రూపాయలు
కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధర ఒక్కొక్క డోసు 1410 రూపాయలు
స్పుట్నిక్ వి వ్యాక్సిన్ ధర ఒక డోసు 1145 రూపాయలు
జీఎస్టీ 5 శాతం, 150 రూపాయలు సర్వీస్ ఛార్జ్ అదనం
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ధరల కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రులపై కఠిన చర్యలుంటాయని కేంద్రం హెచ్చరించింది. అధిక ధరల వసూళ్లపై రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని సూచించింది. వ్యాక్సిన్‌పై పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం(Central government) వ్యాక్సిన్ ప్రక్రియ చర్యలు చేపట్టింది. ఇప్పటికే వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు ఆర్డర్లు ఇచ్చింది.
Also read: Supreme Court: హైకోర్టు న్యాయమూర్తుల నియామకంపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook