Fuel Prices: ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురావాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ అంశంపై ఇప్పుడు కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారు. పెట్రోల్, డీజిల్ ధరల అంశాన్ని జీఎస్టీ పరిధిలో తీసుకురానున్నారా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కరోనా సంక్షోభం(Corona Crisis) నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ పోతున్నాయి. దేశవ్యాప్తంగా సెంచరీ మార్క్ దాటేసింది. చాలాకాలంగా పెట్రోల్, డీజిల్ ధరల్ని(Petrol-Diesel Prices)జీఎస్టీ పరిధిలో తీసుకురావాలనే ప్రతిపాదన నడుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్ఫంగా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చవచ్చనే వార్తలు కూడా విన్పించాయి. ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి చేసిన ప్రకటన నిరాశ కల్గించింది.పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకురావాలనే ప్రతిపాదనే ఇంతవరకూ రాలేదని స్పష్టం చేశారు. 


పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా సభలో ఈ అంశంపై చర్చ సాగింది.పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చే క్రమంలో బాగంగా జీఎస్టీ కౌన్సిల్‌(GST Council)లో చర్చ జరిగిందా లేదా..కేంద్ర ప్రభుత్వానికి(Central government) ప్రతిపాదన చేరిందా లేదా..ఎటువంటి చర్యలు తీసుకున్నారు..రాష్ట్రాలతో సంప్రదింపులు జరిగాయా లేదా అంటూ సభలో సభ్యులు ప్రశ్నించారు. ఈ ప్రశ్నలకు కేంద్ర ఆర్ధికశాఖ సహాయమంత్రి సమాధానమిచ్చారు. ఈ అంశం జీఎస్టీ కౌన్సిల్ పరిధిలోనిదని..జీఎస్టీ పరిధిలో చేర్చాలంటే కౌన్సిల్ సిఫారసు అవసరమని చెప్పారు. జూన్ నెలలో జరిగిన 44 వ సమావేశంలో ఈ అంశమై ఎటువంటి ప్రతిపాదన రాలేదన్నారు. 2021-22 ఆర్ధిక సంవత్సరంలో పెట్రోల్ ధరను 39 సార్లు, డీజిల్ ధరను 36 సార్లు పెంచినట్టు స్వయంగా మంత్రి లోక్‌‌సభ(Loksabha) సాక్షిగా వెల్లడించారు. 2020-21లో అయితే పెట్రోల్ ధరను 76 సార్లు, డీజిల్ ధరను 73 సార్లు పెంచామని తెలిపారు. పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీ(GST) పరిధిలో తీసుకొచ్చే విషయమై రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపాదిస్తే..కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గతంలోనే స్పష్ట చేశారు. 


Also read: Aadhaar Card: ఆధార్ అప్‌డేషన్‌లో కొత్త సౌలభ్యం, ఫోటో మార్చడం ఎలా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook