Summons to Google and Facebook: సోషల్ మీడియాపై కేంద్ర ప్రభుత్వం నిఘా పటిష్టం చేసింది. సామాజిక మాధ్యమాల్ని దుర్వినియోగం చేయకుండా నివారణ చర్యలు చేపడుతోంది. ఇదే అంశంపై గూగుల్ , ఫేస్‌బుక్ సంస్థలకు సమన్లు జారీ అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పౌరుల హక్కుల పరిరక్షణ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగం నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం (Central government) ఇటీవలి కాలంలో నిఘా పటిష్టం చేసింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్ (Facebook) ఇండియా, గూగుల్(Google) ఇండియాలకు ఐటీ పార్లమెంటరీ స్థాయి సంఘం సమన్లు జారీ చేసింది. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ నేతృత్వంలోని ప్యానెల్ ముందు ఈ నెల 29న హాజరుకావాలని సోషల్ మీడియా సంస్థల్ని ఆదేశించింది. ఆన్‌లైన్‌లో మహిళల భద్రతకు తీసుకోవల్సిన చర్యలు, పౌరుల హక్కుల్ని రక్షించడం, ఆన్‌లైన్ న్యూస్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలు సేకరించనుంది. ఈ రెండు సంస్థల ప్రతినిధుల అభిప్రాయ సేకరణ అనంతరం..త్వరలో యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా సంస్థల ప్రతినిధులకు కూడా నోటీసులివ్వనున్నారు. ఇప్పటికే ట్విట్టర్‌ను జూన్ 18వ తేదీన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ (Parliamentary Standing Committee)ప్రశ్నించింది.


Also read: UP Elections: ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై ఒవైసీ దృష్టి, వంద స్థానాల్లో పోటీకు నిర్ణయం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook