UP Elections: ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఎంఐఎం సిద్ధమవుతోంది. మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో ఉనికి చాటుకున్న ఎంఐఎం ఇప్పుడు ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బరిలో దిగేందుకు వ్యూహం పన్నుతోంది.
దేశంలో ఉత్తర ప్రదేశ్ ఎన్నికలంటే (Uttar pradesh Elections) ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. వాస్తవానికి 2022లో యూపీ ఎన్నికలు జరగాల్సి ఉన్నా..ఇప్పట్నించే చర్చ ప్రారంభమైంది. హైదరాబాద్ పార్టీ స్థాయి నుంచి జాతీయ పార్టీగా ఎదుగుతున్న ఏఐఎంఐఎం ఇప్పుడు యూపీ ఎన్నికలపై దృష్టి సారించడంతో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇప్పటికే మజ్లిస్ పార్టీతో పొత్తు ఉండదని బీఎస్సీ తేల్చి చెప్పిన నేపధ్యంలో ఎంఐఎం వైఖరిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ తరుణంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) కీలక ప్రకటన చేశారు. 2022లో జరిగే యూపీ ఎన్నికల్లో వంద స్థానాల్లో పోటీ చేస్తామని ఒవైసీ ప్రకటించారు. ఇప్పటికే అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియను ప్రారంభించామని తెలిపారు. యూపీ ఓంప్రకాశ్ రాజ్‌భర్ సారధ్యంలోని సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీతో కలిసి ఎంఐఎం పోటీ చేయనుంది.
బీహార్ ఎన్నికల్లో 20 స్థానాల్లో పోటీ చేయగా..5 స్థానాల్లో విజయం సాధించింది. మహారాష్ట్ర ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలిచింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో మాత్రం మజ్లిస్ పార్టీ( AIMIM) ఉనికి చాటలేకపోయింది. ఇప్పుడు యూపీ ఎన్నికల్లో ఎలాగైనా పట్టు సాధించాలని ప్రయత్నాలు చేస్తోంది.
Also read: Jammu kashmir: ఆర్టికల్ 370 పునరుద్ధరించేవరకూ ఎన్నికల్లో పోటీ చేయను : మెహబూబా ముఫ్తీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook