Covid19 vaccine: లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలు జారీ
కరోనా వైరస్ కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులో రానుంది. మరి ముందుగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ బెనిఫిషియరీ సిస్టమ్ రూపొందించనుంది.
కరోనా వైరస్ ( Coronavirus ) కు వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులో రానుంది. మరి ముందుగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలనే విషయంపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ( Central Government Advisory ) జారీ చేసింది. కోవిడ్ వ్యాక్సిన్ ( Covid vaccine ) బెనిఫిషియరీ సిస్టమ్ రూపొందించనుంది.
కరోనా వైరస్ నియంత్రణలో ఫ్రంట్ లైన్ వారియర్లు ( Frontline warriors ) గా డాక్టర్లు, నర్శులు, ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు, పారిశుద్ధ్యసిబ్బంది ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. ప్రాణాలొడ్డి మరీ కరోనా వైరస్ నియంత్రణకు పోరాడుతున్నారు. అందుకే దేశం మొత్తం వీరికి నీరాజనం పలుకుతోంది. ఇప్పుడు కరోనా వ్యాక్సిన్ త్వరలో అందుబాటులో రానుంది. ఈ తరుణంలో వ్యాక్సిన్ ముందుగా ఎవరికివ్వాలనే విషయంలో స్పష్టత కోసం కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో పనిచేసే ఆరోగ్య కార్యకర్తల డేటాబేస్‌ను ఏ విధంగా తయారు చేయాలనేది చెబుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ( Central Health ministry ) జిల్లా, రాష్ర్టస్థాయి నోడల్ అధికారులకు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ వివరాలనే ఈ- విన్ ( ఎలక్ర్టానిక్ వ్యాక్సిన్ ఇంటలిజెన్స్ నెట్‌వర్క్ ) ప్రకారం కోవిడ్ వ్యాక్సిన్ బెనిఫిషియరీ మేనేజ్‌మెంట్ సిస్టం ( Vaccine Beneficiary management system ) లో అప్‌లోడ్ చేయాల్సిందిగా సూచించింది. కోవిడ్ వ్యాక్సిన్ లబ్దిదారుల నిర్వహణ వివరాలను ఎలా పొందుపరచాలో తెలుపుతూ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ ఈ మేరకు ఓ లేఖ రాశారు.
వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ లబ్దిదారులు ఎవరనేది గుర్తించడానికి ఈ డేటాబేస్ ఉపయోగపడనుంది. ఫ్రంట్‌లైన్ ఆరోగ్య కార్యకర్తలైన 7-10 లక్షల ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, దాదాపు 15 లక్షల నర్సులు, వైద్యాధికారులు, ఎంబీబీఎస్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్‌తో సహా అల్లోపతి వైద్యులు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ డాక్టర్స్, మెడికల్ అధికార్లు, ఆయుష్ వైద్యులకు ముందుగా కోవిడ్ వ్యాక్సిన్ అందించనున్నారు. వీరితో పాటు పారామెడికల్ సిబ్బంది డేటాబేస్ కూడా సిద్ధం చేయాల్సిందిగా సూచనలు అందాయి. వ్యాక్సిన్ లబ్దిదారుల జాబితాలో వైద్యరంగంలో ఉన్న అన్ని రకాల టెక్నిషియన్స్ , ఫార్మసిస్ట్‌లు, ఫిజియో థెరపిస్టులు, రేడియోగ్రాఫర్లు, వార్డ్ బాయ్స్, ఉంటారు.
మరోవైపు కరోనా వైరస్ నియంత్రణలో అతిముఖ్యంగా ఉన్న వివిధ శాఖలకు చెందిన పారిశుద్ధ్య కార్మికులకు, అంబులెన్స్ డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా ఈ జాబితాలో పొందుపర్చనున్నారు. Also read: Mumbai Dance: కోవిడ్ సెంటర్లో గర్భా నృత్యం, వీడియో వైరల్