కోవిడ్ వైరస్ ( Corona virus ) నేపధ్యంలో పండుగల సంబరాలన్నీ దూరమవుతున్నాయి. సరిగ్గా వైరస్ సంక్రమణ ప్రారంభ సమయంలో హోళీ దూరమైంది. ఇప్పుడు దసరా శరన్నవరాత్రులపై ఆ ప్రభావం కన్పిస్తోంది. ఆ లోటు తీర్చడానికే అన్నట్టుగా కోవిడ్ సెంటర్లో వారందరూ కలిసి ఇలా చేశారా..
దేశ రాజధాని ముంబై ( Mumbai ) లోని గోరేగావ్ లో ఉన్న నెస్కో కోవిడ్ సెంటర్ ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. కరోనా వైరస్ సంక్రమణ నేపధ్యంలో హోళీ మొదలుకుని అన్ని పండుగలు కోలాహలం కోల్పోయాయి. సందడి కన్పించడం లేదు. ఈ లోటు తీర్చడానికే అన్నట్టుగా నెస్కో కోవిడ్ సెంటర్లో నర్శులు, డాక్టర్లు, రోగులు అందరూ కలిసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. పీపీఈ కిట్లు ధరించి సాంప్రదాయంగా వస్తున్న గర్భా డ్యాన్స్ ( Garba Dance ) ను చేశారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
#WATCH Maharashtra: Patients perform 'Garba' with health workers at the Nesco #COVID19 Center in Goregaon, Mumbai. (19.10.20) pic.twitter.com/14AkyeBzpX
— ANI (@ANI) October 19, 2020
దసరా శరనవరాత్రి ( Dussehra ) ఉత్సవాలు మొత్తం దేశమంతా వైభవంగా సాగుతాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ ఉత్సవాల సమయంలో గర్బా డ్యాన్స్ ఓ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. అయితే ఈసారి కోవిడ్ నేపథ్యంలో ఆ సందడి కోలాహలమే లేదు. ఎవరికి వారు కోవిడ్ వైరస్ భయంతో దూరం దూరంగా ఉంటున్న పరిస్థితి. బహుశా అందుకే కోవిడ్ సెంటర్‌లో నర్సులతో పాటు రోగులు సైతం పీపీఈ కిట్లు ధరించి గర్భా నృత్యం చేసి..పండుగ ఆనందాన్ని పంచుకునే ప్రయత్నం చేశారు. కోల్పోయిన సందడిని గుర్తు చేశారు. ముంబై గోరేగావ్‌లోని నెస్కో కోవిడ్ సెంటర్ ( Nesco Covid Centre ) దీనికి వేదికైంది. సంప్రదాయ నృత్యం దాండియాకు బదులుగా రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే మహారాష్ర్ట ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. నవరాత్రి వేడుకలకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ... కోవిడ్ బాధితుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు.. ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ఆసుపత్రి యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంది. గర్భా డ్యాన్స్ ఏర్పాటు చేసింది.
ఇంతకుముందు అస్సాంకు చెందిన డాక్టర్ అరూప్ సేనాపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను ఉత్సాహపరిచేందుకు పీపీఈ కిట్ ధరించి ఇలాగే కాస్త పాటలకు సందడి చేశారు. స్టెప్పులేశారు. ఆ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. కరోనా వైరస్ సంక్షోభ సమయంలో నెగిటివిటీని దరిచేరనీయకుండా.. మిగిలిన వారికీ ఆదర్శంగా ఉండేలా ఇటువంటివి మంచివేనన్న కామెంట్లు కూడా వస్తున్నాయి. Also read: PM Modi Speech: ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది..దిగజార్చవద్దు