Plasma for COVID-19 patients: భోపాల్: భారత్‌లో కరోనావైరస్ వ్యాప్తి నిరంతరం పెరుగుతూనే ఉంది. ఇటీవల కాలంలో చాలామంది కీలక నేతలు, ప్రజప్రతినిధులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడి కోలుకుంటున్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) కూడా కరోనా బారిన పడి ఐదు రోజుల క్రితం డిశ్ఛార్జ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే.  Also read: CM Shivraj Singh: నా దుస్తులు నేనే ఉతుక్కుంటున్నా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ క్రమంలో ఆయన కరోనా రోగులను కాపాడేందుకు.. కరోనా నుంచి కోలుకున్నవారిలో స్ఫూర్తిని నింపేందుకు నడుంబిగించారు. కరోనా నుంచి కోలుకున్నాక.. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తన శరీరంలోని యాంటిబాడీలు కరోనాతో పోరాడుతాయన్నారు. కోవిడ్ బాధితులను కాపాడేందుకు త్వరలో ప్లాస్మాను దానం చేస్తానని ప్రకటించారు. ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయిన తరువాత చౌహాన్ కరోనా పరిస్థితిపై ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించారు. Also read: Kanimozhi: నీకు హిందీ రాదా? నువ్వు భారతీయురాలివేనా?


కరోనా బారిన పడి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గతనెల 25న భోపాల్‌లోని చిరయూ ఆసుపత్రిలో చేరారు. 11 రోజుల చికిత్స అనంతరం ఆయన ఆగస్టు 5న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారు. అప్పటినుంచి ఆయన వైద్యుల సలహా మేరకు హోం క్వారంటైన్‌లో ఉన్నారు.   కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు