CM Shivraj Singh: నా దుస్తులు నేనే ఉతుక్కుంటున్నా..

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్-19 బారిన పడుతున్నారు. చివరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) కూడా కరోనా బాధితుడిగా మారారు. 

Last Updated : Jul 29, 2020, 07:21 AM IST
 CM Shivraj Singh: నా దుస్తులు నేనే ఉతుక్కుంటున్నా..

Covid-19: ఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus ) రోజురోజుకి విజృంభిస్తూనే ఉంది. మహమ్మారి కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజలలతో పాటు ప్రజాప్రతినిధులు, నాయకులు కూడా కోవిడ్-19 బారిన పడుతున్నారు. చివరకు మధ్యప్రదేశ్ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan ) కూడా కరోనా బాధితుడిగా మారారు. దేశంలో కరోనా సోకిన మొదటి ముఖ్యమంత్రి చౌహాన్.. ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని చిరయూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే సీఎం చౌహాన్ మంగళవారం ఆసుపత్రి నుంచి రాష్ట్రంలో కరోనా కట్టడి, తీసుకుంటున్న చర్యలపై మంత్రులు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ పలు ఆసక్తికర విషయాలను మంత్రులు, అధికారులతో పంచుకున్నారు. Also read: Ram Temple: రామ మందిరం భూమి పూజకు అతిథుల జాబితా ఇదే

‘‘ఆసుపత్రిలో నా పనులన్నీ నేనే చేసుకుంటున్నా. తేనీటిని నేనే స్వయంగా తయారు చేసుకుంటున్నా.. నా దుస్తుల్ని నేనే ఉతుక్కుంటున్నా. దీనివల్ల నాకు ఎంతో ఉపయోగం చేకూరింది. గతంలో నా చేతికి సర్జరీ జరిగింది. చాలాసార్లు ఫిజియోథెరపీ చేయించుకున్నా.. పిడికిలి బిగించడానికి ఇబ్బందిగా ఉండేది. కానీ ఇప్పుడు నా దుస్తులు నేనే ఉతకడంతో ఆ సమస్యకి పరిష్కారం లభించింది. ఇలాంటి చిన్న పనులు స్వయంగా మనమే చేసుకుంటే బాగుంటుంది. కరోనా ఒక విధంగా మంచే చేసింది. ఈ వైరస్ గురించి ఎవరూ భయపడవద్దు. జాగ్రత్తలు పాటిస్తే చాలు..’’ అంటూ ఆయన అధికారులతో సంభాషించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది. Also read: Independence day 2020: ఆగస్టు 15న దాడులకు ఐఎస్ఐ భారీ కుట్ర

ఇదిలాఉంటే మధ్యప్రదేశ్‌లో ఇప్పటివరకు దాదాపుగా 29వేల కరోనా కేసులు నమోదు కాగా.. 824మంది మరణించారు. Also read : Ram Mandir: టైమ్ క్యాప్సుల్‌ నిజమేనా? ట్రస్ట్ ఏం చెబుతోంది?

Trending News