Kanimozhi: నీకు హిందీ రాదా? నువ్వు భారతీయురాలివేనా?

ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తెలిపారు. 

Last Updated : Aug 10, 2020, 07:50 AM IST
  • డీఎంకే పార్టీ నేత, ఎంపీ కనిమొళికి చేదు అనుభవం
  • హిందీ రాదని ఇంగ్లీష్, తమిళంలో మాట్లాడాలన్న నేత
  • భారతీయురాలివేనా అని ప్రశ్నించిన సీఐఎస్ఎఫ్ అధికారి
  • ఘటనపై విచారణకు ఆదేశించిన సీఐఎస్ఎఫ్
Kanimozhi: నీకు హిందీ రాదా? నువ్వు భారతీయురాలివేనా?

డీఎంకే పార్టీ కీలక నేత, ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi)కి చేదు అనుభవం ఎదురైంది. ఎయిర్‌పోర్టుకు వచ్చిన సందర్బంగా.. తనకు హిందీ భాష రాదని, తమిళం లేదా ఇంగ్లీష్‌లో మాట్లాడాలని ఆమె అడిగారు. తాను హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్‌ఎఫ్‌కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ (Kanimozhi's Nationality) అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి తెలిపారు. జరిగిన ఘటనపై సీఐఎస్ఎఫ్ విచారణకు ఆదేశించింది. సీఐఎస్ఎఫ్ స్పందించినందుకు కనిమొళి ధన్యవాదాలు తెలిపారు.  రానా పెళ్లిలో సమంత సందడే సందడి

ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. హిందీ రాదని, తమిళం లేక ఇంగ్లీషులో మాట్లాడాలని అడిగాను. కానీ నువ్వు భారతీయురాలివేనా అని సీఐఎస్ఎఫ్ అధికారి ప్రశ్నించింది. భారతీయులకు కచ్చితంగా హిందీలో మాట్లాడటం రావాలని ఎప్పటి నుంచి నిబంధన పెట్టారో తెలుసుకోవాలని ఉందన్నారు. కోవిడ్19 ఇన్ఫెక్షన్లు 6 రకాలు.. ఆ దశలో ప్రాణాలకే ముప్పు

కార్తీ చిదంబరం సైతం ఈ ఘటనపై స్పందించారు. ఈ విషయాన్ని ఖండించారు. కనిమొళి ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ.. భాషాభిమానానికి పరీక్ష పెడుతున్నారు. సీఐఎస్ఎఫ్ దీనికి ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు.

సమస్య తీవ్రతను అర్థం చేసుకున్న సీఐఎస్ఎఫ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది. హిందీ భాష (#hindiimposition)ను రుద్దాలనే ఉద్దేశం మాకు లేదని స్పష్టం చేసింది. హాట్ ఫొటోలతో కవ్విస్తున్న బొద్దుగుమ్మ..
పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే... 

Trending News