Congress leader Ghulam Nabi Azad tests COVID-19 positive న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలనే పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్‌ (Ghulam Nabi Azad) సైతం కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆజాద్ శుక్రవారం ట్విటర్ వేదిక ద్వారా వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని.. హోం క్వారంటైన్‌లో ఉన్నానని ఆజాద్ తెలిపారు. కొన్ని రోజుల నుంచి తనతో సన్నిహితంగా మెలిగిన వారు కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్ చేశారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారతదేశంలో పలు పార్టీలకు చెందిన చాలా మంది రాజకీయ అగ్రనేతలు ఇప్పటికే ఈ మహమ్మారి బారిన పడ్డారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతోపాటు ఇటీవలనే కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు అహ్మాద్‌ పటేల్‌తోపాటు మోతీలాల్‌ వోరా, అభిషేక్‌ సంఘ్వీ కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. Also read: Rahul Gandhi: కరోనా కట్టడిలో భారత్ కన్నా.. పాక్, ఆప్ఘాన్‌లే నయం


ప్రస్తుతం దేశంలో (India Coronavirus cases) మొత్తం కరోనా కేసుల సంఖ్య 73,70,469 కి పెరగగా.. మరణాల సంఖ్య 1,12,161 కి చేరింది. అయితే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 64,53,780 మంది బాధితులు కోలుకోగా.. ప్రస్తుతం దేశంలో 8,04,528 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 


 Also read: Rafale Aircraft: నవంబర్‌లో భారత్‌కు రెండో బ్యాచ్‌ రాఫెల్ యుద్ధ విమానాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe