Loksabha Seats: లోక్‌సభ సీట్లు వేయికి పెరగనున్నాయా, మనీష్ తివారీ మాటల్లో నిజమెంత
Loksabha Seats: భారత పార్లమెంట్‌లోని లోక్‌సభలో స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో సీట్ల సంఖ్య రెట్టింపు కావచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
Loksabha Seats: భారత పార్లమెంట్‌లోని లోక్‌సభలో స్థానాల సంఖ్య పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. ఈ ఆలోచన త్వరలో కార్యరూపం దాల్చవచ్చని తెలుస్తోంది. లోక్‌సభలో సీట్ల సంఖ్య రెట్టింపు కావచ్చనే వార్తలు విన్పిస్తున్నాయి.
భారత లోక్‌సభలో(Loksabha) ప్రస్తుతం ఉన్న స్థానాల సంఖ్య 543. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఈ సంఖ్యను పెంచాలనే ప్రతిపాదన చాలాకాలంగా ఉంది. మాజీ రాష్ట్రపతి దివంగత ప్రణబ్ ముఖర్జీ కూడా లోక్‌సభ స్థానాల్ని వేయికి పెంచాల్సిన అవసరముందని గతంలో వ్యాఖ్యానించిన పరిస్థితి. లోక్‌సభతో పాటు రాజ్యసభ,శాసనసభల్లో కూడా సీట్ల సంఖ్య పెంచాల్సిన పరిస్థితి ఉందని అప్పట్లో ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ ఇదే విషయాన్ని వెల్లడించారు. లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 స్థానాల్ని వేయికి పెంచే ఆలోచనలో మోదీ ప్రభుత్వం(Modi government) ఉందని చెప్పారు. తన సహచర బీజేపీ ఎంపీల ద్వారా ఈ సమాచారం లభించినట్టు మనీష్ తివారీ(Manish Tiwari) తెలిపారు. కొత్త పార్లమెంట్ ఛాంబర్(New Parliament Building)ని కూడా వేయిమంది కూర్చునే సామర్ధ్యంతో నిర్మిస్తున్న విషయాన్ని మనీష్ తివారీ గుర్తు చేశారు. అయితే పార్లమెంట్ స్థానాల్ని పెంచే ముందు ప్రజాభిప్రాయ సేకరణ తప్పనిసరిగా తీసుకోవాలని తివారీ చెప్పారు. ప్రతిపాదిత ఆలోచనలో మహిళలకు 1/3వ వంతు రిజర్వేషన్ ఉండాలన్నారు.
Also read: Black Money: ఇండియా నుంచి ఎంత నల్లధనం స్విస్ ఖాతాల్లో..ఎన్ని కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook