West Bengal CM Mamata Banerjee dares PM Modi: పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల ప్రచారం మరింత జోరుగా సాగుతోంది. తృణమూల్ కాంగ్రెస్(TMC) పార్టీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ శుక్రవారం నాడు తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు బెంగాల్‌లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీఎంసీని, తనను తరువాత నియంత్రించవచ్చునని, ముందుగా హోం మంత్రి అమిత్ షాను అదుపులో ఉంచాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు. కూచ్ బెహర్ జిల్లాలోని దినాహతాలో నిర్వహించిన ర్యాలీలో భాగంగా దీదీ మమతా బెనర్జీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీని, అమిత్ షాను సవాల్ చేసేలా వ్యాఖ్యలు చేశారు. నందిగ్రామ్ నుంచి కచ్చితంగా తాను విజయం సాధిస్తానని మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి ధీమా వ్యక్తం చేశారు. తాను నందిగ్రామ్ నుంచి తప్పక విజయం సాధిస్తానని, అలాంటప్పుడు ఇతర స్థానం నుంచి పోటీ చేయాల్సిన పని లేదని పీటీఐతో వ్యాఖ్యానించారు.


Also Read: Gold Price Today: బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం ధరలు, వెండి ధరలు పైపైకి


బీజేపీ నేత సువేందు అధికారికి ఓటమి తప్పదని, తృణమూల్ కాంగ్రెస్ కచ్చితంగా విజయం సాధిస్తుందని మమతా పేర్కొన్నారు. అయినా మీ మాటలు వినేందుకు నేనేమైనా బీజేపీ నాయకురాలినా అని ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi)ని సూటిగా ప్రశ్నించారు. 200 స్థానాల్లో పశ్చిమ బెంగాల్ ప్రజలు తమను గెలిపిస్తారని టీఎంసీ అధినేత్రి, సీఎం మమతా బెనర్జీ ధీమా వ్యక్తం చేశారు. గురువారం నాడు ఓ పోలింగ్ కేంద్రానికి వెళ్లిన సందర్భంగా కొంత గందరగోళం నెలకొంది. రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల వద్ద చట్టాలు సరిగా పాటించడం లేదంటూ దీనిపై ఆమె గవర్నర్ జగ్దీప్ ధన్‌కర్‌కు ఫిర్యాదు చేశారు.


Also Read: ITR Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టాలు, కొత్త నియమాలు ఇవే, ఎవరిపై ప్రభావం


పోలింగ్ కేంద్రం వల్ల అల్లరి చేసిన వ్యక్తులు ఒక్కరూ కూడా బెంగాళీలో మాట్లాడటం లేదని, వారంతా బయటివారేనని మమతా బెనర్జీ అనుమానం వ్యక్తం చేశారు. వారంతా బిహార్, ఉత్తరప్రదేశ్ నుంచి బెంగాల్‌కు వచ్చిన గూండాలని, కేంద్ర బలగాలతో కేంద్ర ప్రభుత్వం వారికి రక్షణ కల్పించిందని ఆమె ఆరోపించారు. ఏప్రిల్ 1న పశ్చిమ బెంగాల్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 8 దశలలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా షెడ్యూల్ చేశారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన మే 2న జరగనుంది.


Also Read: Changes From April 2021: ఈపీఎఫ్, టీడీఎస్ సహా ఏప్రిల్ 1, 2021 నుంచి మారనున్న అంశాలివే 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook