తొలి స్వదేశీ కరోనా వ్యాక్సిన్ ( First indian vaccine ) సన్నద్ధమవుతోంది. భారత్ బయోటెక్ సంస్థ-ఐసీఎంఆర్  సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న కోవాగ్జిన్ పై కీలక ప్రకటన వెలువడింది. 2021 ఫిబ్రవరి నాటికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని ఐసీఎంఆర్ ప్రకటించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ ( Corona virus ) ప్రారంభమైపోయింది. వ్యాక్సిన్ ఇంకా ప్రయోగాల దశలోనే ఉంది. ఈ నేపధ్యంలో కోవిడ్ 19 వ్యాక్సిన్ ( Covid19 vaccine ) పై ఐసీఎంఆర్ ( ICMR ) కీలక ప్రకటన చేసింది. భారతదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ ( Bharat Biotech company ) ఐసీఎంఆర్ తో కలిసి కోవ్యాగ్జిన్ ( Covaxin ) పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తోంది. తొలి స్వదేశీ వ్యాక్సిన్ ఇదే. ఈ క్రమంలో ఐసీఎంఆర్ చేసిన కీలక ప్రకటన ఆశలు రేకెత్తిస్తోంది. 


కరోనా వైరస్ మహమ్మారిపై ఆందోళన కల్గించే వార్తలు వస్తున్న తరుణంలో ఈ ప్రకటన రావడం ఊరటనిస్తోంది. ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford- Astrazeneca ) కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తి, మార్కెటింగ్ ఒప్పందం ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాక్సిన్ కంపెనీ సీరమ్ ఇనిస్టిట్యూట్ ( Serum institute ) తో జరిగింది. మూడవ దశలో ఉన్న ప్రయోగాలు విజయవంతంగా ఉన్నాయని...జనవరి 2021 నాటికి వ్యాక్సిన్ అందుబాటులో వస్తుందని ఇటీవలే ప్రకటించిన పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్ కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ సైతం 2021 ఫిబ్రవరి నాటికి అందుబాటులో వస్తుందని ఐసీఎంఆర్ వెల్లడించడం కొత్త ఆశలు రేపుతోంది. Also read: Maharashtra: అర్నాబ్ గోస్వామి అరెస్టుపై సామ్నా సంచలన వ్యాఖ్యలు


తొలి స్వదేశీ వ్యాక్సిన్ గా ఉన్న కోవ్యాగ్జిన్ చివరి దశ అంటే మూడవ దశ పరీక్షలు 25 వేలమందితో ఈ నెలలోనే ప్రారంభం కానున్నాయి. ఈ వ్యాక్సిన్ మొదటి రెండు దశల ప్రయోగాల్లో మంచి సామర్ధ్యం కన్పించిందని ఐసీఎంఆర్ స్పష్టం చేసింది. మూడవ దశ పరీక్షలు పూర్తయ్యేలోగా..కోవ్యాగ్జిన్ ను ప్రజలకు అందించవచ్చా లేదా అనేది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Central Health ministry ) నిర్ణయించనుంది. వ్యాక్సిన్ అందుబాటులో వస్తే..కరోనా వైరస్ నియంత్రణకు సాధ్యమవుతుంది. Also read: Covid19 vaccine: వ్యాక్సిన్ మూడవదశ ప్రయోగాలు సక్సెస్..జనవరి నాటికి వ్యాక్సిన్