Maharashtra: అర్నాబ్ గోస్వామి అరెస్టుపై సామ్నా సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి అరెస్టు వ్యవహారం మరింతగా ముదురుతోంది. శివసేన ముఖపత్రిక మరోసారి ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలతో బీజేపీ నేతలపై కౌంటర్ అటాక్ చేసింది.

Last Updated : Nov 5, 2020, 02:22 PM IST
Maharashtra: అర్నాబ్ గోస్వామి అరెస్టుపై సామ్నా సంచలన వ్యాఖ్యలు

వివాదాస్పద జర్నలిస్టు అర్నాబ్ గోస్వామి ( Arnab Goswamy ) అరెస్టు వ్యవహారం మరింతగా ముదురుతోంది. శివసేన ( Shiv sena ) ముఖపత్రిక మరోసారి ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలతో బీజేపీ నేతలపై కౌంటర్ అటాక్ చేసింది. 

ఇంటీరియర్ డిజైనర్ అన్వే నాయక్‌ ఆత్మహత్య కేసులో రిపబ్లికన్ టీవీ ( Republican tv ) ఎడిటర్ ఇన్ ఛీప్ అర్నాబ్ గోస్వామి అరెస్టైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అర్నాబ్ అలీబాగ్ లోని తాత్కాలిక జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. అర్నాబ్ అరెస్టును బీజేపీ ( Bjp ) నేతలు బ్లాక్ డే గా అభివర్ణించడంతో మహారాష్ట్రలోని అధికారపార్టీ శివసేన మండిపడింది. బీజేపీ నేతలపై కౌంటర్ అటాక్ చేస్తోందిప్పుడు. బీజేపీ, శివసేన వివాదాన్నిఅర్నాబ్ అరెస్టు వ్యవహారం మరింతగా పెంచేసింది. Also read: CTET 2020 Exam Date: జనవరి 31న సీటెట్

శివసేన ముఖపత్రిక సామ్నా( Samna ) లో ఈ వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు ప్రచురితమయ్యాయి. పత్రికా స్వేచ్ఛపై దాడి, అత్యవసర పరిస్థితులంటున్న కేంద్రమంత్రుల వ్యాఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయని సామ్నా ఎద్దేవా చేసింది. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జర్నలిస్టులపై జరుగుతున్న దాడుల్ని, హత్యల్ని ప్రస్తావించింది. 

మహారాష్ట్ర ప్రభుత్వం ( Maharashtra Government )లో మీడియాపై దాడి అనే ప్రశ్నే ఉండదని సామ్నా స్పష్టం చేసింది. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నవారే..ప్రజాస్వామ్యానికి మొదటి పిల్లర్ గా ఉన్న శాసనసభను ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపించింది.  వాస్తవానికి అర్నాబ్ గోస్వామిని రక్షించడానికే గత ప్రభుత్వం..అన్వే నాయక్ ఆత్మహత్య కేసును కప్పిపుచ్చిందని సామ్నా తన సంపాదకీయంలో ఆరోపించింది. గతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు గుజరాత్‌లో ఒక జర్నలిస్టును అరెస్టు చేసిన సంగతిని గుర్తు చేసింది. అటు యూపీలో జర్నలిస్టులు హత్యకు గురవుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ అమాయక వ్యక్తి తన వృద్ధాప్య తల్లితో పాటు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ప్రధానమంత్రి ( prime minister ) తో సహా అందరూ చట్టం ముందు సమానమేనని సంపాదకీయం వ్యాఖ్యానించింది. Also read: Boat capsize: బీహార్‌లో పడవ బోల్తా.. 70 మంది గల్లంతు

Trending News