హైదరాబాద్: కరోనా మహమ్మారి (Covid-19) విజృంభణ రోజురోజుకు తీవ్ర రూపం దాల్చుతోంది. ఇప్పటికే ముప్పుతిప్పలు ఎదుర్కొంటున్న తరుణంలో కరోనా వైరస్ లక్షణాల్లో మరో రెండు వచ్చి చేరాయి. ఇప్పటి వరకు ఈ జాబితాలో ఏడు లక్షణాలు ఉండగా, తాజాగా అనోస్మియా (వాసన లేమి), ఎగూసియా (రుచిని తెలుసుకోలేకపోవడం) వంటి లక్షణాలు వచ్చి చేరాయి. ఇవి రెండూ కూడా కరోనా లక్షణాలేనని కేంద్రం హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. అంటే వాసన, రుచిని గుర్తించలేకపోవడం కూడా వైరస్ లక్షణాలేనని తెలిపింది. మిగతా ఏడు లక్షణాల్లో జ్వరం, దగ్గు, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫము, కండరాల నొప్పి, ముక్కు కారడం, గొంతుమంట, విరేచనాలు వంటివి ఉన్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదికి కరోనా పాజిటివ్
ఇదిలాఉంటే దేశవ్యాప్తంగా మహమ్మారి మూడు లక్షల మార్కును దాటేసింది. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య  రోజురోజుకీ పెరిగిపోతోంది. శనివారం ఒక్కరోజే కొత్తగా  3,493 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో మరో 113 మంది చనిపోవడంతో కరోనా మరణాల సంఖ్య 3,830కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌  కేసుల సంఖ్య 1,04,568కు పెరిగింది. ముంబై మహానగరంలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి.  మహారాష్ట్రలో కరోనా పరీక్షలు తక్కువగా చేస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. 


జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


నటి మీరా చోప్రా హాట్ ఫొటోలు వైరల్