యెస్ బ్యాంక్ కస్టమర్లకు భారీ ఊరట
ఆర్థిక సంక్షోభం చిక్కుకున్న యెస్ బ్యాంకు తమ కస్టమర్లకు కాస్త ఊరట కల్పించింది. నగదు విత్ డ్రాపై మరో అవకాశాన్ని కల్పించింది.
ముంబై: భారీ సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంకు ఖాతాదారులకు కాస్త ఊరట కలగనుంది. యెస్ బ్యాంకు ఏటీఎంలు ఖాళీ అయ్యాయని లబోదిబో మంటున్న ఆ బ్యాంకు ఖాతాదారులకు ఉపశమనం కలిగేంచే వార్త చెప్పింది. తమ ఖాతాదారులు ఇతర బ్యాంకు ఏటీఎంల్లోనూ నగదు డ్రా చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఈ మేరకు యెస్ బ్యాంక్ తమ అధికారిక ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేసింది.
Also Read: ఆ కార్డులు మార్చి 16 తర్వాత పనిచేయవు!
సంక్షోభంలో చిక్కుకున్న యెస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రానా కపూర్‌ను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఆదివారం అరెస్ట్ చేశారు. అరెస్టుకు ముందు కొన్ని గంటలపాటు రానాను ఈడీ విచారించినట్లు సమాచారం. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ కార్పొరేషన్ పేరుతో సంస్థలో అక్రమ నగదు చలామణికి పాల్పడినట్లు పీఎంఎల్ చట్టం కింద రానాపై కేసు నమోదైన విషయం తెలిసిందే.
Also Read: 2నిమిషాల్లో పాన్ కార్డ్, ఆధార్ ఇలా లింక్ చేసుకోండి
కాగా, యెస్ బ్యాంకుపై ఆర్బీఐ మార్చి 6న మారటోరియం విధించింది. బ్యాంకు ఖాతాదారుల విత్ డ్రాలపై రూ.50వేల పరిమితిని నిర్ధేశించింది. ఏప్రిల్ 3వ తేదీ వరకు ఈ పరిమితి కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
See Pics: మొన్న పింక్ బికినీలో.. నేడు బ్లాక్ బికినీ..
బీ అలర్ట్: WhatsAppలో ఈ10 తప్పులు చేస్తున్నారా?