Draupadi Murmu : అత్యంత పేద కుటుంబం.. గృహహింస బాధితురాలు! ద్రౌపది ముర్ము జీవితం విషాదభరితం..
Draupadi Murmu: రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ద్రౌపది ముర్ము. పార్టీల బలాబలాల ఆధారంగా ఒడిషాకు చెందిన గిరిజన నేత భారత రాష్ట్రపతిగా గెలవడం లాంఛనమే. ద్రౌపది ముర్ముకు బీజేపీ అంచనా కంటే ఎక్కువ ఓట్లే రావొచ్చని తెలుస్తోంది.
Draupadi Murmu : రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు ద్రౌపది ముర్ము. పార్టీల బలాబలాల ఆధారంగా ఒడిషాకు చెందిన గిరిజన నేత భారత రాష్ట్రపతిగా గెలవడం లాంఛనమే. ద్రౌపది ముర్ముకు బీజేపీ అంచనా కంటే ఎక్కువ ఓట్లే రావొచ్చని తెలుస్తోంది. విపక్ష పార్టీల నుంచి కూడా ఆమెకు మద్దతు లభిస్తోంది. భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబోతున్న ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం ఎందరికో స్పూర్తిగా నిలుస్తోంది. కడు పెదరికం నుంచి దేశ అత్యున్నత పదవి వరకు రావడం నిజంగా అద్భుతమే. ముర్ము చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. అన్నింటిని ధైర్యంగా అధిగమించి ఇప్పుడు భారత రాష్ట్రపతి కాబోతున్నారు.
ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం అత్యంత విషాదభరితంగా సాగింది. ఒడిస్సా రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన మయూర్‌భంజ్ జిల్లా బైడపోసి గ్రామంలోని గిరిజన సంథాన్ తెగ కుటుంబంలో జన్మించారు ద్రౌపది ముర్ము. కడు పేదరికాన్ని అధిగమిస్తూ చదువు కొనసాగించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు విద్యాభ్యాసం సాగించిన ద్రౌపది ముర్ము. తర్వాత ఇరిగేషన్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. కొంత కాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో పాఠశాలలో స్వచ్ఛందంగా టీచర్ గా పనిచేశారు. చాలా కాలం పాటు అక్కడే పనిచేశారు. ద్రౌపది ముర్ము జీవితం గురించి బీజేపీ ఎంపీ పీసీ మోహన్ పలు ఆసక్తికర అంశాలు చెప్పారు. ఎంపీ చెప్పిన వివరాల ప్రకారం ద్రౌపది ముర్ము బాల్య వివాహ బాధితురాలు. ఆమె 15 ఏళ్లకే తల్లి అయింది. అత్తారింట్లో గృహహింసను ఎదుర్కొంది.
ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం సాఫీగానే సాగినా.. ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం అన్ని కష్టాలే. ముర్ము భర్త పేరు శ్యాంచరణ్. వీళ్లకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ద్రౌపది భర్త శ్యాంచరణ్ తోపాటు ఇద్దరు కొడుకులు చనిపోయారు. మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే ద్రౌపది ముర్ముకు సర్వస్వం. గిరిజనం బాగు కోసం తపించే ద్రౌపది.. అందుకు రాజకీయాలను ఎంచుకుంది. బీజేపీలో చేరిన ద్రౌపది ముర్ము 1997లో రాయ్‌రంగ్‌పూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా గెలిచారు. 2000లో రాయ్‌రంగ్‌పూర్ ఎమ్మెల్యే అయ్యారు. బీజేపీ-బీజేడీ సంకీర్ణ సర్కార్ లో మంత్రిగా పనిచేశారు. 2004లో రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2015లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులయ్యారు ద్రౌపది ముర్ము. ఐదేళ్లపాటు గవర్నర్ గా పని చేశారు.
Read Also: దేశంలో 50 రాష్ట్రాల ఏర్పాటు..? ముక్కలు కానున్న ఆ రాష్ట్రాలు.. కర్ణాటక మంత్రి సంచలన వ్యాఖ్యలు
Read Also:Monkeypox: 58 దేశాలకు వ్యాపించిన మంకీపాక్స్.. మహమ్మారిగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి