Monkeypox: రెండున్నర ఏళ్లుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్ మహమ్మారి ఇంకా విజృంభిస్తూనే ఉంది. కొత్త రూపంలో విరుచుకుపడుతూ జనాలను ఆగమాగం చేస్తోంది. కొవిడ్ కల్లోలం కొనసాగుతుండగానే.. ఇప్పుడు మరో మహమ్మారి భయపెడుతోంది. మంకీపాక్స్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. ఇప్పటివరకు 58 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. 3 వేల 417 మందికి మంకీపాక్స్ సోకిందని వివిధ దేశాల నుంచి వచ్చిన వైద్య నివేదికలు చెబుతున్నాయి. తాజాగా మంకీపాక్స్ ను మహమ్మారి ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్.
మంకీపాక్స్ వేగంగా విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమైంది. మంకీపాక్స్ పై హెల్త్ ఎమెర్జెన్సీగా ప్రకటించాలా వద్దా అన్న అంశంపై చర్చించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. అయితే ఆ సమావేశం కంటే ముందే ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్‌ను మహమ్మారిగా ప్రకటించింది. మంకీపాక్స్ కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచిస్తూ ప్రపంచ దేశాలను అలర్ట్ చేసింది ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్. జాగ్రత్తగా లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మంకీపాక్స్ ఒక్క దేశం లేదా ప్రాంతానికి పరిమితం కాదని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఆ మహమ్మారిని కట్టడి చేసేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని దేశాలను ఆదేశించింది.
అయితే కొవిడ్ తో పోలిస్తే మంకీపాక్స్ అంత తేలికగా వ్యాపించదు. కాని పలు దేశాలకు విస్తరించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ ద్వారా కేసులు పెరుగుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య నెట్‌వర్క్ గుర్తించింది.ఇది చాలా ప్రమాదకరమని చెబుతోంది. పెద్దల కంటే చిన్నారుల్లో మంకీపాక్స్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువులతో సహా వన్యప్రాణులకు సంక్రమించే ప్రమాదం ఉందని తెలిపింది. మంకీపాక్స్ మహమ్మారి నియంత్రణకు తక్షణమే చర్యలు చేపట్టాలని.. లేదంటే తీవ్ర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే మంకీపాక్స్ సోకిన రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని.. మంకీపాక్స్ కు వ్యాక్సిన్‌లు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయని వైద్య వర్గాలు చెబుతున్నాయి.
Read also: Konaseema: కోనసీమలో మళ్లీ హై టెన్షన్.. వేలాది మంది పోలీసులతో పహారా!
Read also: Konda Surekha Love Marriage: కొండా సురేఖ, కొండా మురళి లవ్ మ్యారేజ్ ఎలా జరిగిందంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.