న్యూ ఢిల్లీ: కారులో ఒంటరిగా ప్రయాణిస్తున్న ఓ న్యాయవాదిని ఆపిన పోలీసులు.. కారులో మాస్కు ధరించలేదనే కారణంతో ఛలానా ( Fine imposed for not wearing mask in car ) విధించారు. కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ( COVID-19 guidelines ) ప్రకారం కారులో ఒంటరిగా వెళ్తున్న వ్యక్తి మాస్కు ధరించాల్సిన అవసరం లేదని సదరు న్యాయవాది పోలీసులకు ఎంత నచ్చజెప్పినా వాళ్లు వినిపించుకోలేదు. కారులో ఒంటరిగా వెళ్లే వ్యక్తి తప్పనిసరిగా మాస్కు ధరించాలని ప్రభుత్వం విధించిన నిబంధనకు సంబంధించిన ఆదేశాలు ఏమైనా ఉంటే.. ఆ కాపీని చూపించాల్సిందిగా న్యాయవాది చేసిన డిమాండ్‌ని సైతం పోలీసులు పట్టించుకోలేదు. న్యాయవాది నుంచి ముక్కు పిండి మరీ ఆయన నుంచి జరిమానా వసూలు చేశారు. సెప్టెంబర్ 9న ఢిల్లీలో జరిగిన ఈ ఘటనపై సౌరబ్ శర్మ అనే సదరు న్యాయవాది ఢిల్లీ హైకోర్టును ( Delhi High court ) ఆశ్రయించారు. Also read : Paytm APP: ప్లే‌స్టోర్ నుంచి పేటీఎం యాప్‌ను తొలగించిన గూగుల్


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒంటరిగా కారులో ప్రయాణిస్తున్న తాను మాస్కు ధరించకపోవడం వల్ల ఎవ్వరికీ ఎటువంటి హానీ లేదని.. ఇదే విషయాన్ని పోలీసులకు వివరించి చెప్పినా వారు పట్టించుకోలేదని సౌరభ్ శర్మ ఢిల్లీ పోలీసులపై హైకోర్టుకు ఫిర్యాదు ( Petition against Delhi police ) చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఢిల్లీ పోలీసులు తన వద్ద నుంచి రూ.500 జరిమానా వసూలు చేశారని.. నడిరోడ్డుపై తనకు జరిగిన ఈ అవమానం తనని తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేలా చేసిందని సౌరభ్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. తన వద్ద వసూలు చేసిన రూ.500 జరిమానా తిరిగి ఇప్పించడంతో పాటు తనను ఇబ్బందులకు గురిచేసి, మానసికంగా హింసించిన ఢిల్లీ పోలీసుల నుంచి రూ. 10 లక్షల నష్టపరిహారం ( Compensation ) ఇప్పించాలని కోర్టును విజ్ఞప్తి చేశారు. న్యాయవాది సౌరబ్ శర్మ పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు.. నవంబర్ 18న పిటిషన్ విచారిస్తామని స్పష్టం చేసింది. Also read : Health tips: కాలు మీద కాలు వేసి కూర్చుంటున్నారా ? ఐతే మీకు ఈ సమస్యలు తప్పవట


సొంత వాహనంలో ఒంటరిగా ప్రయాణం పబ్లిక్ ప్లేస్ కాదు:
పబ్లిక్ ప్లేస్‌లో మాస్కు ధరించలేదనే నేరం కింద తనకు రూ.500 జరిమానా విధించారని కోర్టు దృష్టికి తీసుకొచ్చిన న్యాయవాది సౌరబ్ శర్మ.. సొంత కారులో ఒంటరి ప్రయాణం పబ్లిక్ ప్లేస్ కాదు ( Travelling alone in personal car is not a public place) అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు ఏమని తీర్పు చెప్పనుందనేదే ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. Also read : 
MIDHANI Recruitment 2020: అసిస్టెంట్ జాబ్స్.. ఎగ్జామ్ లేకుండానే రిక్రూట్‌మెంట్


మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం...



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYeR