Chiranjit Dhibar: కోల్‌కతా:  కోవిడ్-19 ( Covid-19 ) వ్యాక్సిన్ ఆగస్టు 15  నాటికి సిద్ధం చేసేందుకు ఐసీఎంఆర్ ( ICMR ), భారత్ బయోటెక్ ( Bharat Biotech ) సంయుక్తంగా ప్రయత్నిస్తున్నాయి. కరోనావైరస్ వ్యాక్సిన్ నిర్ణీత గడువులోపు సిద్ధం అయితే మొదటి టీకా ఎవరికి ఇవ్వాలో నిర్ణయించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( RSS ) సభ్యుడు అయిన చిరంజీత్ ధీబర్‌ ( Chiranjit Dhibar )పై తొలి వ్యాక్సిన్ పరీక్షించనున్నారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ఐసీఎంఆర్ ) భువనేశ్వర్ సెంటర్‌లో మనుషులపై ( Human Trials ) ప్రయోగాలు చేయనుంది. చిరంజీత్ ధీబర్‌కు ఈ మేరకు ఐసీఎంఆర్ నుంచి ఫోన్ కూడా వచ్చింది. మొదటి కరోనావైరస్ వ్యాక్సిన్‌ కోసం ధీరజ్ మానసికంగా సిద్ధం అవుతున్నాడు.  Also Read: Countries Without Covid-19: కరోనా వైరస్ నుంచి సురక్షితంగా ఉన్న దేశాలివే


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Facts About Chiranjit Dhibhar : చిరంజీత్ ధీబర్ గురించి


చిరంజీత్ ధీబర్‌ బెంగాల్‌లోని దుర్గాపూర్‌లో స్కూట్ టీచర్. దాంతో పాటు ఆర్ఎస్ఎస్‌లో సభ్యుడు కూడా. కోవిడ్-19 తొలి వ్యాక్సిన్ ( Covid-19 First Vaccine ) తనపై పరీక్షించనున్నారు అనే విషయం తెలిశాక చిరంజీత్ మీడియాతో మాట్లాడాడు. కరోనావైరస్ వ్యాక్సిన్ పరీక్ష గురించి తను ఏప్రిల్‌లోనే అప్లై చేసిన విషయం తెలిపాడు. దానికి సంబంధించి ఇటీవలే అధికారుల నుంచి ఫోన్ వచ్చిందని వివరించాడు. కరోనావైరస్ తొలి టీకా ఫలితాలు ఎలా ఉన్నా తాను మానసికంగా సిద్ధంగా ఉన్నాను అని తెలిపాడు ధీబర్. అదే సమయంలో ధీబర్ తండ్రి తన కుమారుడి నిర్ణయాన్ని అభినందించారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..