Hathras case latest news updates: లక్నో: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో వినిపిస్తోన్నట్టుగా అత్యాచారం జరిగిందనే ఆరోపణల్లో నిజం లేదని.. బాధితురాలిపై అసలు అత్యాచారమే జరగలేదని ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు ( Uttar pradesh police ) ప్రకటించారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ రిపోర్ట్స్ ( FSL reports ) ప్రకారం దాడిలో బాధితురాలు తీవ్రంగా గాయపడిన కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టుగా ఉందని యూపీ అదనపు డైరెక్టర్ జనరల్ ( లా అండ్ ఆర్డర్ ) ప్రశాంత్ కుమార్ తెలిపారు. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ నివేదికలు కూడా వచ్చాయని.. ఫోరెన్సిక్ పరీక్షల్లో వీర్యం నమూనాల ( Sperm samples ) జాడ కనిపించలేదని ప్రశాంత్ కుమార్ అన్నారు. అందుకే ఎఫ్ఎస్ఎల్ నివేదికల ప్రకారం బాధితురాలిపై అత్యాచారం, సామూహిక అత్యాచారం వంటి లైంగిక దాడులు జరగలేదని ఆయన స్పష్టంచేశారు. Also read : Hathras rape case: హత్రాస్ గ్యాంగ్ రేప్ కేసులో రేప్ నిర్థారణ కాలేదన్న హత్రాస్ ఎస్పీ

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాధితురాలు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ తనపై అత్యాచారం జరిగిందని పేర్కొనలేదని.. దాడి జరిగిందని ( Girl beaten ) మాత్రమే చెప్పిందని ప్రశాంత్ కుమార్ గుర్తుచేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టి హింసను రాజేయడం కోసమే ఎవరో కావాలనే దురుద్దేశంతో ఆమెపై అత్యాచారం జరిగినట్టుగా వదంతులు వ్యాపింపచేశారని, వాళ్లెవరో త్వరలోనే పట్టుకుంటామని ప్రశాంత్ కుమార్ తెలిపారు. Also read : Hathras Case: అర్థరాత్రి దహన సంస్కారాలపై వివరణ ఇవ్వండి: మహిళా కమిషన్