IT Refund Status: ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు చేశారా..దాఖలు చేయకపోతే గడువు ఇంకా ఉంది. వెంటనే చేసేండి. అటు ఇన్‌కంటాక్స్ శాఖ నుంచి రిఫండ్ చెల్లింపు కూడా ప్రారంభమైంది. ఆన్‌లైన్‌లో మీ రిఫండ్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ తిరిగి చెల్లిస్తున్నట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ప్రకటించింది. ఏప్రిల్ 1 2021-ఆగస్టు 30, 2021 మధ్య 23.99 లక్షలమందికి 67 వేల 401 కోట్ల విలువైన రిఫండ్ వెనక్కి చెల్లించే ప్రక్రియ ప్రారంభమైంది. సెప్టెంబర్ 8న ఐటీఆర్ దాఖలు చేసిన 22 లక్షల 61 వేల 918 మందికి ఆదాయపు పన్ను రిఫండ్ చేసినట్టు ఇన్‌కంటాక్స్ డిపార్ట్‌మెంట్ (Incometax Department) తెలిపింది. రిటర్న్స్ చెల్లించేందుకు గడువు కూడా పొడిగించారు. మార్చ్ 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ కొత్త ఈ ఫైలింగ్ పోర్టల్‌లో ఎదురైన పలు ఇబ్బందుల మధ్య ఐటీఆర్ దాఖలు ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో తలెత్తిన సమస్యల కారణంగా చాలామంది ఇంకా ఐటీఆర్ దాఖలు చేయలేదు. ఐటీఆర్ రిఫండ్ చేసిన పదిరోజుల్లోగా చెల్లింపు జరుగుతుంది. అయితే వివిధ కారణాల వల్ల ఆలస్యం కూడా కావచ్చు. మీ రిఫండ్ ఇంకా రాకపోతే ఐటీఆర్ స్టేటస్ ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవచ్చు.


ముందుగా మీరు ఐటీ డిపార్ట్‌మెంట్ ఈ ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావల్సి ఉంటుంది. ఆ తరువాత రిటర్న్స్ ఆప్షన్ (IT Returns) ఎంచుకోవాలి. తరువాత మై అక్కౌంట్ ట్యాబ్‌కు వెళ్లి..ఐటీ రిటర్న్స్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు సబ్మిట్‌పై క్లిక్ చేయాలి. ఆ తరువాత అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌పై క్లిక్ చేయాలి. ఆదాయపు పన్ను రిఫండ్ స్టేటస్‌తో పాటు రిటర్న్ వివరాలు పేజీపై కన్పిస్తాయి. పన్ను చెల్లింపుదారు రిఫండ్ డబ్బును నేరుగా వారి ఖాతాకే క్రెడిట్ చేస్తారు. లేదా చెక్ ద్వారా గానీ డీడీ రూపంలో గానీ ఇంటి చిరునామాకు పంపిస్తారు. అయితే మీరు ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు బ్యాంకుకు సంబంధించిన వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవల్సి ఉంటుంది. లేదంటే మీ రిఫండ్ (IT Refund) ఆగిపోతుంది. 


Also read; Cyber Crimes: మీకు ఆ మెసేజ్‌లు లేదా లింకులు వస్తున్నాయా..అయితే జాగ్రత్త మరి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.