Cyber Crimes: మీకు ఆ మెసేజ్‌లు లేదా లింకులు వస్తున్నాయా..అయితే జాగ్రత్త మరి

Cyber Crimes: సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో విభిన్నమైన పద్ధతుల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అందుకే అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే లింకులు, మెస్సేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 17, 2022, 11:39 AM IST
Cyber Crimes: మీకు ఆ మెసేజ్‌లు లేదా లింకులు వస్తున్నాయా..అయితే జాగ్రత్త మరి

Cyber Crimes: సాంకేతికత అభివృద్ధి చెందేకొద్దీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో విభిన్నమైన పద్ధతుల్లో సైబర్ నేరాలు జరుగుతున్నాయి. అందుకే అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే లింకులు, మెస్సేజీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ఇప్పుడంతా స్మార్ట్ దొంగతనాలే. రోడ్డుపై ప్రమాదం జరిగినట్టు నటించడం, సహాయం చేయడానికొచ్చినవారిని దోచుకోవడం సర్వసాధారణమైపోయింది. మరోవైపు సైబర్ నేరాలు చాలా ఎక్కువైపోయాయి. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరాలు (Cyber Crimes) అధికమయ్యాయి. వివిధ రకాల మెస్సేజీలు, లేదా లింకుల్ని పంపించి మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ క్రైమ్స్‌లో ఎన్ని రకాలుగా వీలుంటే అన్ని రకాలుగా మోసాలు జరుగుతున్నాయి. 

వర్క్ ఫ్రం హోం..రోజుకు 2 వేల రూపాయలు ఇంటి నుంచే సంపాదించుకోవచ్చు..కంప్యూటర్ పని వస్తే చాలు..ఇలాంటి మెస్సేజీలు (Work from home messages)ఎక్కువైపోయాయి. అది తెలియక ఓ మహిళ వాట్సప్ చాటింగ్ ప్రారంభించింది. రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడంతో తన బ్యాంకు ఎక్కౌంట్ తో పాటు, భర్త, తల్లి ఖాతాలతో కూడా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసింది. ఆ తురవాత పెట్టుబడి కాస్త పెడితే అధిక ఆదాయం వస్తుందని చెప్పడంతో ముందు 2 వందల రూపాయలు పెట్టుబడి పెట్టారు. వెంటనే ఆ మహిళకు 363 రూపాయలు వచ్చాయి. ఆ తరువాత నాలుగు విడతల్లో 3 లక్షల 62 వేల 84 రూపాయలు పెట్టుబడి పెట్టగా..7 లక్షల 35 వేల 480 రూపాయలు వచ్చినట్టుగా సమాచారం వచ్చింది. అయితే ఆ నగదును ఉపసంహరించుకునేందుకు వీలు కాలేదు. అలా మోసపోయింది ఆ మహిళ.

ఆ తరువాత ఫేస్‌బుక్ (Facebook) లోన్ ఇస్తామనే ప్రకటన చూసి మోసపోయాడు మరో యువకుడు. లక్షల్లో రుణం వచ్చిందని చెప్పి.బీమా, ఈఎంఐ ఛార్జెస్, ఆర్బీఐ ఛార్జెస్, జీఎస్టీ, ఇలా రకరకాలుగా డబ్బులు కట్టించుకుని మోసం చేశారు. వివిద రకాల మెస్సేజిలు, లేదా లింకుల్ని పంపించి సైబర్ నేరాలు పాల్పడుతున్నారు. అందుకే తెలియని లేదా అపరిచిత నెంబర్ల నుంచి వచ్చే ప్రకటనలు లేదా మెస్సేజీలు, లేదా లింకుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ Unknown messages or Links) క్లిక్ చేయవద్దంటున్నారు సైబర్ నిపుణులు. అలా క్లిక్ చేస్తే మీ ఫోన్ నెంబర్‌కు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాల వివరాలు నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోతాయి. మీ మొబైల్‌కు మెస్సేజ్ రాకుండానే బ్యాంక్ ఎక్కౌంట్ ఖాళీ అయిపోతుంటుంది. ఒకవేళ మోసానికి గురైతే వెంటనే పోలీసులు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తే వెంటనే సొమ్ము వెనక్కి తీసుకునేందుకు వీలవుతుంది.

Also read: Aadhaar and Pancard: ఆధార్ కార్డు, పాన్‌కార్డుల్ని మరణానంతం ఏం చేయాలి, లేకపోతే ఏం జరుగుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x