Tamilnadu Heavy Rains Alert: తమిళనాడును భారీ వర్షాలు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయం కాగా..మరో 15 జిల్లాలకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఓ వైపు బంగాళాఖాతంలో(Bay of Bengal) ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గత 4 రోజులుగా తమిళనాడులో (Heavy Rains in Tamilnadu)వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరోవైపు కొత్తగా ఏర్పడిన మరో అల్పపీడనం ప్రభావంతో మరో 4 రోజులపాటు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. మొన్న శనివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు , వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్య్యాయి. చెన్నైను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలో దిగాయి. అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో ముఖ్యంగా చెన్నైలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఫలితంగా చెన్నై సహా 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. 


చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాల్లో భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తున్నాయి. పుదుకొట్టై, తిరువారూర్, తేన్ కాశీ, తిరునల్వేలి, కన్యాకుమారి, మధురై, రామనాథపురం, శివగంగై జిల్లాల్లో వర్షాలు పొంచి ఉన్నాయని ఐఎండీ(IMD)వెల్లడించింది. ఈ నేపధ్యంలో చెన్నై నగరంలో మూడు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలను మోహరించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాల కారణంగా 12 జిల్లాల్లో నేడు, రేపు పాఠశాలకు ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అదే విధంగా.. కన్యాకుమారి,  చెన్నై ప్రాంతాలలో(Chennai Floods) మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని అధికారులు హెచ్చరికలు జారీచేశారు. భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కావేరి నది, వైగై,   థెన్- పెన్నై, భవానీ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. 


Also read: Covid19 Update: రెండేళ్లలో 25 కోట్లమందికి కరోనా వైరస్, హాట్‌స్పాట్‌లు ఆ దేశాలే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook