FCRA Act: దేశంలో ప్రతిష్ఠాత్మక సంస్థలకు షాక్ ఎదురైంది. విదేశీ విరాళాల్ని కోల్పోనున్నాయి. సరైన సమయంలో, సరైన కారణాలతో రెన్యువల్ లేని కారణంగా ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నాయి. ఆ వివరాలంటే పరిశీలిద్దాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశంలో నడుస్తున్న చాలా సంస్థలకు ప్రతియేటా కోట్లాది రూపాయలు విదేశీ నిధులు వస్తుంటాయి. అయితే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద లైసెన్స్ తీసుకోవడం, దాన్ని ప్రతియేటా పునరుద్ధరించుకోవడం తప్పనిసరి. లేకపోతే ఆ సంస్థల లైసెన్స్ రద్దవుతుంది. ఈ విషయంలో కేంద్ర హోంశాఖ కఠినంగానే వ్యవహరిస్తుంటుంది. ఈసారి దాదాపు 6 వేల సంస్థల లైసెన్స్ రద్దవడంతో విరాళాలను కోల్పోయాయి.


దేశంలో లైసెన్స్ రెన్యువల్ లేని కారణంగా ఏకంగా 5 వేల 789 ఎన్ జీవో సంస్థలు విదేశీ విరాళాల్ని(Foreign Donations) కోల్పోయాయి. ఇందులో ప్రతిష్ఠాత్మక ఢిల్లీ ఐఐటీ (Delhi IIT), ఇండియన్ మెడికల్ అసోసియే,న్, జామియా మిల్లియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్ మ్యూజియం, లైబ్రరీ వంటి ప్రముఖ సంస్థలున్నాయి. FCRA చట్టం ప్రకారం లైసెన్స్ పునరుద్ధరణకు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేయకపోవడం, చేసుకున్న దరఖాస్తు తిరస్కరించడం వంటి కారణాలతో సంస్థల లైసెన్స్ రెన్యువల్ కాలేదని కేంద్ర హోంశాఖ (Union Home Ministry) అధికారులు వెల్లడించారు. ఈ సంస్థల లైసెన్స్ జనవరి 1 వతేదీతో అంటే నిన్నటితో ముగిసింది. దేశవ్యాప్తంగా మొన్నటివరకూ 22 వేల 762 సంస్థలుండగా ఇప్పుడా సంఖ్య 16 వేల 829కు తగ్గింది.


లైసెన్స్ గడువు ముగిసి రెన్యువల్ కాని సంస్థల్లో(License Renewal) ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్, లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమన్, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఆక్స్‌ఫామ్ ఇండియా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్, గోద్రెజ్ మెమోరియల్ ట్రస్ట్, ది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొసైటీ, జేఎన్యూ న్యూక్లియర్ సైన్స్ సెంటర్, లాల్ బహదూర్ శాస్త్రి మెమోరిల్ ఫౌండేషన్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఫిషర్ మెన్స్ కోఆపరేటివ్, భారతీయ సంస్కృతి పరిషద్, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంస్థలున్నాయి. 


Also read: Emerald Shivling: రూ.500 కోట్ల విలువైన శివలింగం స్మగ్లింగ్.. తమిళనాడులో అధికారుల స్వాధీనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి