India Corona Cases Live Updates: ఇండియాలో బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ ఇన్‌ఫెక్షన్ కేసులు నమోదవుతున్నా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖ పడుతున్నాయి. గత నెల నుంచి కరోనా సెకండ్ వేవ్ తీవ్రత భారత్‌లో తగ్గింది. ఓ రోజు వ్యవధిలో నమోదైన పాజిటివ్ కేసుల కన్నా డిశ్చార్జ్ కేసులు దాదాపు లక్ష వరకు అధికంగా ఉండటం ఊరటనిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో గడిచిన 24 గంటల్లో 20,19,773 (20.19 లక్షలు) శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 1,32,788 మంది కరోనా బారిన పడ్డారు. నిన్నటితో పోల్చితే కేసులు స్వల్పంగా పెరిగాయి. దేశంలో ఇప్పటివరకూ కరోనా వైరస్ (CoronaVirus) బాధితుల సంఖ్య 2,83,07,832 (2 కోట్ల 83 లక్షల 7 వేల 832)కు చేరుకుంది. కోవిడ్19 మరణాలు మరోసారి పెరిగాయి. తాజాగా కరోనాతో పోరాడుతూ మరో 3,207 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకూ కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 3,35,102కి చేరుకుంది.


Also Read: Gold Price Today In Hyderabad 02 June 2021: వరుసగా మూడోరోజు బంగారం ధర జిగేల్, మిశ్రమంగా వెండి ధరలు



తాజాగా 2,31,456 (2 లక్షల 31 వేల 456) మంది కరోనా మహమ్మారిని జయించారు. వీటితో కలిపి దేశ వ్యాప్తంగా ఇప్పటివరకూ  కోవిడ్19ను జయించిన వారి సంఖ్య 2,61,79,085 (2 కోట్ల 61 లక్షల 79 వేల 85)కు చేరుకుంది. గత ఏడాది కరోనా వైరస్ వ్యాప్తి మొలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 35,00,57,330 (35 కోట్ల 57 వేల 330) శాంపిల్స్‌కు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తాజా ప్రకటనలో వెల్లడించింది.


Also Read: Indian Covid-19 Variants: ఇండియన్ కోవిడ్-19 వేరియంట్స్‌కు Kappa మరియు Deltaగా నామకరణం చేసిన WHO


భారత్‌లో ఇప్పటివరకూ 21,85,46,667 డోసుల వ్యాక్సినేషన్ జరిగినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్ కేసులు (COVID-19 Infections) నమోదవుతున్నప్పటికీ దేశంలో యాక్టివ్ కేసులు దిగిరావడం ఊరటనిస్తోంది. ప్రస్తుతం 17 లక్షల 93 వేల 645 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా రికవరీ రేటు భారీగా పెరుగుతోందని, కరోనా పాజిటివిటీ రేటు క్రమేపీ తగ్గుతుందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా బులెటిన్‌లో తెలిపింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook