India Covid-19: 78 లక్షలు దాటిన కరోనా రికవరీల సంఖ్య
భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది.
Coronavirus updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో ( India ) కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ విస్తరిస్తూనే ఉంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు వెలుగులోకి వస్తుండగా.. వందల సంఖ్యలో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో నమోదైన కేసులు, మరణాలతో పోల్చుకుంటే.. ప్రస్తుతం రెండింటి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇంకా ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే.. రోజూ నమోదయ్యే కేసులకన్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య నిత్యం గణనీయంగానే పెరుగుతూనే ఉంది. అయితే శుక్రవారం మళ్లీ కరోనా కేసులు 50 వేల మార్క్ దాటాయి. గత 24 గంటల్లో శుక్రవారం ( నవంబరు 6న ) దేశవ్యాప్తంగా కొత్తగా.. 50,357 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 577 మంది మరణించారు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 84,62,081 కి చేరగా.. మరణాల సంఖ్య 1,25,562 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ (Union Health Ministry) శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Bihar Assembly Election 2020: బీహార్ తుది దశ పోలింగ్ ప్రారంభం
అయితే.. శుక్రవారం కరోనాతో 53,920 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటివరకు కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న (Total cured cases) వారి సంఖ్య 78,19,887 కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో 5,16,632 కరోనా కేసులు యాక్టివ్‌గా (active cases) ఉన్నట్లు వెల్లడించింది. అయితే ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 92.41 శాతం ఉండగా.. మరణాల రేటు 1.48 శాతం ఉంది.
ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 11,13,209 కరోనావైరస్ నిర్థారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) వెల్లడించింది. ఈ టెస్టులతో కలిపి నవంబరు 6 వరకు దేశంలో మొత్తం 11,65,42,304 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది. Also read: Kajal, Gautam latest pics: న్యూ ఫొటోషూట్‌లో తళుక్కుమన్న కొత్త జంట
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe