భారత్‌లో రోజురోజుకూ కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిన్న ఒక్కరోజే దేశంలో 9971 కరోనా పాజిటివ్ కేసులు (CoronaVirus Cases In India) నమోదయ్యాయి. ఒక్కరోజు కరోనా కేసులలో దేశంలో ఇదే అత్యధికం. కాగా, గడిచిన 24 గంటల్లో దేశంలో 287 మంది మరణించడం విచారకరం. తాజా కేసులతో కలిపి భారత్‌లో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,46,628కు చేరింది.  అందాల నటి కల్పిక గణేష్ Photos


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తాజాగా నమోదైన కోవిడ్19 (COVID-19) పాజిటివ్ కేసులతో స్పెయిన్ దేశాన్ని భారత్ వెనక్కి నెట్టింది. స్పెయిన్‌లో 2.41లక్షల కేసులతో ఆరో స్థానానికి పడిపోగా, ప్రతిరోజూ అత్యధికంగా కరోనా కేసులు నమోదు చేస్తున్న భారత్ 5వ స్థానానికి ఎగబాకింది. అమెరికా, బ్రెజిల్, రష్యా, యూకే మాత్రమే భారత్‌ కంటే అధికంగా కరోనా కేసులు నమోదు చేసిన దేశాల జాబితాలో ఉన్నాయి. కరోనా మరణాలలో మాత్రం భారత్ 12వ స్థానంలో ఉంది. ఈ మరణాలు ఇలాగే కొనసాగితే జూన్ చివరికల్లా టాప్5 చేరే అవకాశాలున్నాయని తెలుస్తోంది. Actors Commit Suicide: షూటింగ్స్ లేక ఆర్థిక సమస్యలతో అన్నాచెల్లెళ్ల ఆత్మహత్య


ఈ కేసులకుగానూ 1,19,293 మంది ప్రాణాంతక వైరస్ కోవిడ్19 బారి నుంచి కోలుకుని  సురక్షితంగా ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పటివరకూ దేశంలో 6,929 కరోనా మరణాలు సంభవించాయి. ప్రస్తుతం భారత్‌లో 1,20,406 యాక్టీవ్ కేసులున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఓ వెల్లడించింది. ఈ మేరకు ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
గ్లామర్ డాల్ సెక్సీ ఫొటోలు వైరల్