లద్దాఖ్ ప్రాంతంలోని భారత భూభాగాన్ని ( India ) చైనాలో భాగంగా చూపించినందుకు ట్విట్టర్ కు భారత ప్రభుత్వం గట్టి వార్నింగ్ ఇచ్చింది. భారత మ్యాప్ ను తప్పుగా ప్రెజెంట్ చేసినందుకు భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు ఐటీ సెక్రటరీ అజయ్ సావ్నే ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీకు లేఖ రాశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


Also Read |  VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!


సోషల్ మీడియా ( Social Media) దిగ్గజం ట్విట్టర్ భారత భూభాగాన్ని జియో లోకేషన్ లో చైనాలో ( China ) భాగంగా చూపింది. ఇది భారత సార్వభౌత్వానికి, సమగ్రతకు భంగం కలిగిస్తోంది అని ఎట్టి పరిస్థితిలో దీన్ని భరించేది లేదు తని స్పష్టం చేసింది ప్రభుత్వం.


ఇలాంటి చర్యలు ట్విట్టర్ పై గౌరవాన్ని తగ్గించడంతో పాటు భారతదేశ సార్వభౌమత్వానికి, ఐక్యతకు, సమగ్రతకు భంగంగ కలిగిస్తుంది అని లేఖలో రాశారు. అదే సమయంలో లేహ్ లోని హెడ్ క్వార్టర్స్, లద్దాఖ్ రెండూ జమ్మూ కశ్మీర్ లో భాగం అని.. జమ్మూ కశ్మీర్ భారతదేశంలో భాగం అని స్పష్టం చేశాడు సావ్నే.




Also Read | Happy Birthday Prabhas: రాధేశ్యామ్ బీట్స్ వచ్చేస్తున్నాయోచ్!


భారత ప్రభుత్వ లేఖపై స్పందించిన ట్విట్టర్ అధికార ప్రతినిధి స్పందిస్తూ ప్రభుత్వ లేఖను గౌరవిస్తున్నాం అని ..అందులోని అంశాలను స్వీకరిస్తున్నాం అని తెలిపారు.



A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


IOS Link - https://apple.co/3loQYeR