Happy Birthday Prabhas: రాధేశ్యామ్ బీట్స్ వచ్చేస్తున్నాయోచ్!

Prabhas Birthday | ఈ పోస్టర్ ను గమనిస్తే ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, మనుసును హత్తుకునేలా బీట్స్ ఉంటాయి అనిపిస్తోంది. ఇప్పటికైతే ఇదంతా గెస్సింగే.. అసలు విషయం రేపు 12 గంటలకు తెలిసిపోతుంది.  

Last Updated : Oct 22, 2020, 08:50 PM IST
    1. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు
    2. కీలక అప్డేట్స్ వచ్చే అవకాశం
    3. రాధే శ్యామ్ బీట్సే రేపే అంటున్న ప్రభాస్
Happy Birthday Prabhas: రాధేశ్యామ్ బీట్స్ వచ్చేస్తున్నాయోచ్!

Radhe Shyam Movie Beats | డార్లింగ్ ప్రభాస్ ( Prabhas) అభిమానులకు శుభవార్త. అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టిన రోజు సంద్భంగా కీలక అప్డేట్ ఉంటుంది అని.. కానీ అది ఏమై ఉంటుంది అని ప్యాన్స్ తెగ గెస్సింగ్స్ చేసేస్తున్న సమయంలో కీలక అప్డేట్ వచ్చేసింది.

Also Read |  VISA Updates: వీసా నిబంధనల్లో కీలక సడలింపు చేసిన కేంద్రం.. వివరాలు ఇవే!

బాహుబలి ప్రభాస్ నటిస్తున్న రాధేశ్యామ్ ( Radhe Shyam ) మూవీకి సంబంధించిన అప్డేట్ ఇది. సాహో హీరో ప్రభాస్ బర్త్ డే సందర్భంగా రేపు బీట్స్ విడుదల చేయనున్నారట.

రాధేశ్యామ్ మూవీ బీట్స్  విడుదల గురించి ప్రభాస్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశాడు. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ఆన్ 23 అక్టోబర్ అని ఉన్న చిన్నపాటి పోస్టర్ ను షేర్ చేసి ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగలాంటి వార్తను అందజేశాడు.

Also Read | US Elections 2020: ట్రంప్‌పై మండిపడ్డ బ‌రాక్ ఒబామా

ఈ పోస్టర్ ను గమనిస్తే ఒక బ్యూటీఫుల్ లవ్ స్టోరీ, మనుసును హత్తుకునేలా బీట్స్ ఉంటాయి అనిపిస్తోంది. ఇప్పటికైతే ఇదంతా గెస్సింగే.. అసలు విషయం రేపు 12 గంటలకు తెలిసిపోతుంది.
 

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G IOS Link - https://apple.co/3loQYeR

Trending News