Indian Railways: రైల్వే ప్రయాణీకులకు ఊరట లభించనుంది. రైలు ప్రయాణం చేయాలంటే ఇక అది తప్పనిసరి కాకుండా నిర్ణయం తీసుకోబోతోంది. త్వరలో జరగనున్న సమావేశంలో రైల్వే శాఖ ఈ మేరకు ప్రకటన చేయనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేశీయ రైల్వే ప్రయాణీకులకు ఇండియన్ రైల్వేస్ (Indian Railways) ఊరట కల్గించనుంది. కోవిడ్ కారణంగా రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లు వెలవెలబోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో రైళ్లు ఖాళీగా ఉంటున్నాయి. రైలులో ప్రయాణించాలనుకునేవారు కోవిడ్ 19 ఆర్టీపీసీఆర్ పరీక్ష (RTPCR Test) తప్పనిసరిగా చేయించుకోవాలనే నిబంధనే దీనికి కారణంగా తెలుస్తోంది. రైలు ప్రయాణం చేయాలనుకునేవారు కోవిడ్ 19 టెస్ట్ తీసుకుని వస్తున్నారు. త్వరలో ఈ నిబంధనను భారతీయ రైల్వే సడలించే అవకాశాలు కన్పిస్తున్నాయి. కోవిడ్ 19 టెస్ట్ (Covid19 Test) రిపోర్ట్ కంటే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ తప్పనిసరి చేయాలనే ఆలోచన ఉంది. ఇలా చేయడం వల్ల వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం కావచ్చనే ఆలోచన కూడా ఉంది. అయితే ఇంకా దీనిపై రైల్వే శాఖ తుది నిర్ణయం తీసుకోలేదు. జూన్ 15న జరిగే సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. అటు విమానయాన శాఖ కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలున్నాయి. వ్యాక్సిన్ (Corona Vaccine) రెండు డోసులు తీసుకున్నవారికి ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేయకూడదని విమానయాన శాఖ భావిస్తోంది. 


దేశంలో గత కొద్దిరోజులతో పోలిస్తే కరోనా కేసులు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. గత 24 గంటల్లో 94 వేల 52 కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ కోవిడ్ కారణంగా 3 లక్షల 59 వేల 676 మంది మరణించారు. 


Also read: Corona Third Wave: 5 ఏళ్లలోపు చిన్నారులకు Face Masks అక్కర్లేదు, DGHS సూచన


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook