Covid-19 updates in India: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ (Coronavirus) విలయతాండవం సృష్టిస్తోంది. గతంలో ఎన్నడూ మూడు నాలుగురోజుల నుంచి లక్షకు చేరువలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. మరణాలు నమోదవుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో శుక్రవారం ( సెప్టెంబరు 11న ) దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్తగా.. 97,570 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు నిన్న ఒక్కరోజే ఈ మహమ్మారి కారణంగా 1,201 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 46,59,985 కి పెరగగా.. మరణాల సంఖ్య 77,472 కి చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. Also read: Drugs case: డ్రగ్స్ కేసులో.. హీరోయిన్లు సారా, రకుల్?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 9,58,316 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 36,24,197 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలాఉంటే.. శుక్రవారం దేశవ్యాప్తంగా 10,91,251 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. దీంతో సెప్టెంబరు 11 వరకు మొత్తం 5,51,89,226 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు 77.77 శాతం ఉండగా.. మరణాల రేటు 1.66శాతం ఉంది.    Also read: Ketika Sharma: కేతిక అందాలు అదరహో..