Karnataka: విజయం సాధించినందుకు ఆనందించాలో..ఆ మనిషే లేనందుకు బాధపడాలో తెలియని సందిగ్ద పరిస్థితి. స్థానిక ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆమె..కోవిడ్ కారణంగా మరణించారు. వివరాలేంటంటే.. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్నాటక (Karnataka)రాష్ట్రంలో విచిత్రమైన, సందిగ్దమైన పరిస్థితి ఎదురైంది.ఇటీవల జరిగిన స్థానిక సంస్థల (Local Body Elections)ఎన్నికల్లో ఓ అభ్యర్ధి భారీ విజయం సాధించారు. అయితే ఫలితాలకు ముందే కోవిడ్ సోకి ప్రాణాలు కోల్పోయారు ఆ అభ్యర్ధి. విజయం సాధించినందుకు సంతోషించాలో..మనిషే లేనప్పుడు విజయం ఎందుకని బాధపడాలో తెలియని పరిస్థితి. మనిషి లేకపోయినా...ప్రజల గుండెల్లో మాత్రం ఉన్నానని నిరూపించుకున్నారు ( Covid Deceased wins the election) ఆ అభ్యర్ధి.


రామనగర (Ramnagara)నగరసభ ఎన్నికల్లో 4వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన లీల భారీ మెజార్టీతో విజయం సాధించారు. దురదృష్టం ఏంటంటే ఫలితాలు వెలువెడక ముందే కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. మనిషిని కోల్పోయి విషాదంలో ఉన్న ఆ కుటుంబానికి ఆమె విజయం సాధించిన విషయం ఏమాత్రం ఆనందం కల్గించలేకపోయింది. అయితే ప్రజల్లో తనకున్న స్థానమేంటనేది అందరికీ తెలిసింది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ (Congress), జేడీఎస్ ( JDS) పార్టీలు చాలా ప్రాంతాల్లో విజయం సాధించాయి. చెన్నపట్టణ నగర సభ ఎన్నికల్లో జేడీఎస్ పరువు దక్కించుకుంది. 31 వ వార్డుల్లో 16 కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీజేపీ( Bjp) లు ఏడేసి స్థానాలు గెల్చుకున్నాయి. 


Also read: India Corona Outbreak: దేశంలో కరోనా విలయతాండవం, 24 గంటల్లో 4 లక్షలకు పైగా కేసులు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook