Karnataka Results 2023: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని లేదా మేజిక్ ఫిగర్‌కు చేరువలో ఉంటుందనే అంచనాలైతే వచ్చాయి గానీ ఇంత భారీ విజయం దక్కుతుందని ఎవరూ ఊహించలేదు. కాంగ్రెస్ గాలికి బీజేపీ మంత్రులు సైతం ఓటమి పాలయ్యారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలో వీచిన కాంగ్రెస్ గాలికి ఏకంగా 136 సీట్లు గెల్చుకుంది ఆ పార్టీ. మరోసారి అధికారం చేజిక్కించుకుంటామని భావించిన బీజేపీ కేవలం 64 స్థానాలకు పరిమితమైంది. కింగ్ లేదా కింగ్ మేకర్ అవుతామని ప్రకటనలు చేసిన జేడీఎస్ 20 స్థానాలతో సరిపెట్టుకుంది. భారీగా వీచిన కాంగ్రెస్ గాలికి బీజేపీ మంత్రులు సైతం కొట్టుకుపోయారు. 


ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సహా 12 మంది మంత్రులు విజయం సాధిస్తే 11 మంది మంత్రులు మాత్రం ఓడిపోయారు. హిజాబ్ ఆందోళనను పెంచి పోషించడమే కాకుండా విద్వేషపూరిత వ్యాఖ్యలతో సంచలనం రేపిన మరో మంత్రి బీసీ నగేష్ సైతం ఓడిపోయారు. ఓడిపోయిన మంత్రుల్లో రాజరాజేశ్వరి నగర్ నుంచి మునిరత్న, ఎల్లాపూర్ నుంచి శివరామ్ హెబ్బార్, వరుణ నుంచి వి సోమన్న, బళ్లారి నుంచి బీఎస్ శ్రీరాములు, చిక్కనాయకపల్లి నుంచి మధుస్వామి, ముథోల్ నుంచి గోవింద కరజోల్, చిక్ బళ్లాపూర్ నుంచి కే సుధాకర్, హోస్కోట్ నుంచి ఎంటీబీ నాగరాజ్, హీరేకెరూర్ నుంచి బీసీ పాటిల్, బీళగి నుంచి మురుగేష్ నిరాణి తో పాటు బీసీ నగేశ్, శంకర్ పాటిల్ తదితరులు ఓటమిపాలయ్యారు. 


ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో ఏకంగా 19 బహిరంగసభలు, 6 రోడ్ షోలు నిర్వహించినా ఫలితం లేకపోయింది. బీజేపీకు చెందిన కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు రంగంలో దిగినా ఫలితం లేకపోయింది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై 35 వేల మెజార్టీతో 54.95 శాతం ఓట్లతో విజయం సాధించగా, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్న డీకే శివకుమార్ 73 శాతం ఓట్లతో ఘన విజయం దక్కించుకున్నారు. 


Also read: Karnataka Results 2023: కర్ణాటకలో కాంగ్రెస్ ఘన విజయంతో మూసుకుపోయిన బీజేపీ దక్షిణ ద్వారం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook