Karnataka Results 2023: దేశం యావత్తూ ఆసక్తిగా ఎదురుచూసిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకు పట్టం కట్టాయి. రెండవసారి అధికారం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసిన బీజేపీ ఓటమి పాలవడంతో ఆ పార్టీ దక్షిణ ద్వారం మూసుకుపోయింది.
2023 కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే పగ్గాలు దక్కుతాయని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసినా ఇంత భారీ విజయాన్ని ఎవరూ ఊహించలేదు. పార్టీ ఓటమితో ఆ పార్టీకు ఉన్న ఏకైక దక్షిణ ద్వారం మూసుకుపోయింది. దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం కోసం బీజేపీ చాలాకాలంగా ఎదురుచూస్తోంది. ఉత్తరాదిన పూర్తి పట్టు సాధించినా దక్షిణాదిన సాధ్యం కావడం లేదు. అలాంటిది కర్ణాటకలో గత రెండు పర్యాయాలుగా కాస్త పట్టు లభించింది. దాంతో కర్ణాటకను దక్షిణాది ద్వారంగా ఆ పార్టీ భావిస్తోంది.
బీజేపీకు ఇప్పుడు ఉన్న ఆ ఒక్క ద్వారం మూసుకుపోయింది. ఇక కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఏపీ, ఒడిశాల్లో అధికారం దక్కించుకునే అవకాశాలు ఇప్పట్లో లేవు. కర్ణాటక ఒక్కటీ ఇప్పుడు దూరమైంది. 2018 ఎన్నికల్లో 104 స్థానాలు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్న బీజేపీ 38 స్థానాలు కోల్పోయింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం 136 స్థానాలు గెల్చుకుని 45 స్థానాలు అదనంగా సాధించింది. ఇక జేడీఎస్ 20 స్థానాలు గెల్చుకుని 15 స్థానాలు మైనస్ అయింది.
కర్ణుడి చావుకు కారణాలు అనేకమన్నట్టు..కర్ణాటకలో బీజేపీ ఓటమికి చాలా కారణాలున్నాయి. బీజేపీ ప్రభుత్వ అవినీతి, మత తత్వ విధానాలు, రాహుల్ గాంధీ, హిజాబ్ అంశం వంటివి ప్రధాన భూమిక వహించాయి. వీటితో పాటు ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ఆరు ముఖ్యమైన హామీలు కూడా ప్రజల్ని ఆకర్షించాయని చెప్పవచ్చు.
కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్, కుటుంబంలో ప్రతి మహిళకు 2000 రూపాయలు, దారిద్రరేఖకు దిగువన ఉన్న ప్రతి ఒక్కరికీ నెలకు 10 కేజీల బియ్యం, నిరుద్యోగ పట్టభద్రులకు నెలకు 3000 రూపాయల నిరుద్యోగ భృతి, నిరుద్యోగ డిప్లొమా హోల్డర్లకు నెలకు 1500, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అంశాలున్నాయి.
Also read: Congress Victory Secret: కన్నడ నాట కాంగ్రెస్ విజయం వెనుక వ్యూహాలు ఆ వ్యక్తివేనా, ఎవరా వ్యక్తి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook