Karnataka: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తోంది. మహారాష్ట్ర తరువాత కర్నాటకలో కేసుల సంఖ్య పెద్దఎత్తున పెరుగుతోంది. కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రాణాంతక కరోనా వైరస్ (Coronavirus) మరోసారి పంజా విసురుతోంది. దేశంలో మహారాష్ట్ర, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలతో పాటు కర్నాటకలో భారీగా కేసులు పెరుగుతున్నాయి. కర్నాటకలో గత 24 గంటల్లో ఏకంగా 2 వేల 792 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. అదే సమయంలో 1964 మంది కోవిడ్ బారిన పడి కోలుకున్నారు. రెండు నెలల కాలంలో ఏకంగా 16 మంది కరోనా వైరస్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో మొత్తం 9 లక్షల 89 వేల 804 పెరిగింది. 9 లక్షల 53 వే 416 మంది కోలుకున్నారు. 12 వేల 520 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23 వేల 849 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 227 మంది రోగులు ఐసీయూలో ఉన్నారు.


ప్రస్తుతం బెంగళూరులో 1742 కేసులు, సిలికాన్ సిటీలో 1742 కేసులున్నాయి. 1356 మంది కోలుకోగా..9 మంది మృతి చెందారు. బెంగళూరులో మొత్తం కేసుల సంఖ్య 4 లక్షల 29 వేల 915 కి పెరగగా..4 లక్షల 9 వేల 65 మంది కోలుకున్నారు. మరోవైపు 4 వేల 590 మంది మరణించారు. ప్రస్తుతం 16 వేల 259 యాక్టివ్ కేసులున్నాయి. మరోవైపు కర్నాటక(Karnataka)లో కోవిడ్ పరీక్షల సామర్ధ్యం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 వేల 197  కోవిడ్ పరీక్షలు చేశారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో 2 కోట్ల 11 లక్షల 95 వేల 741కు చేరింది. 


రాష్ట్రంలో లాక్‌డౌన్(Lockdown),కంటైన్మెంట్ జోన్‌లు, కరోనా ఆంక్షలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవిన్యూ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ ఆలోచన చేస్తోంది. ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి యడ్యూరప్ప(Karnataka cm yeddyurappa) సంబంధిత అధికార్లకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యవహారపై ఏ అధికారి గానీ, మంత్రిగానీ, ప్రజా ప్రతినిధి గానీ బహిరంగవ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. మరోవైపు ఉప ఎన్నికల నేపధ్యంలో కరోనా మార్గదర్శకాల్ని పట్టించుకోకుండా ర్యాలీలు, సమావేశాలు ప్రారంభమవడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.


Also read: Sharad pawar: శరద్ పవార్‌కు అనారోగ్యం, ముంబై బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో త్వరలో శస్త్ర చికిత్స


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook