Kiccha Sudeep Comments: నేను BJPకి మద్దతు ఇవ్వడం లేదు.. స్పష్టత ఇచ్చిన కన్నడ నటుడు కిచ్చా సుదీప్
Kiccha Sudeep Comments: ఈగ సినిమా పేరు చెప్పగానే రాజమౌళితో పాటు గుర్తొచ్చేది ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేళ సుదీప్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. బీజేపీలో చేరి మద్దతు ప్రకటించారనే వార్తలు గుప్పుమంటున్నాయి.
Kiccha Sudeep Comments on Joining BJP: కర్ణాటక ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. మేనెలలో ఎన్నికలున్నాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ కన్నడ నటుడు కిచ్చా సుదీప్ బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఆయనతో పాటు కన్నడ నటుడు దర్శన్ సైతం బీజేపీలో చేరనున్నాడని తెలుస్తోంది. అయితే ఏది నిజం, ఎంతవరకూ నిజమనేది పరిశీలిద్దాం.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో సినీ గ్లామర్ వాడుకునేందుకు రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే కొందరు వివిధ పార్టీల కండువాలు కప్పుకుంటున్న పరిస్థితి ఉంది. తాజాగా కన్నడ నటులు కిచ్చా సుదీప్, దర్శన్‌లు బీజేపీలో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇవాళ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. కిచ్చా సుదీప్ ఎస్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే కాకుండా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు కావడంతో అతని చేరిక లాభిస్తుందనే ఆలోచనలో పార్టీ ఉంది. ఇక మరో నటుడు దర్శన్ ఇప్పటికే 202లో ఆర్ఆర్ నగర్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్ధి తరపున ప్రచారం చేశారు. అంబరీష్ మరణానంతరం మాండ్యా లోక్‌సభ ఉపఎన్నికలో స్వతంత్ర అభ్యర్ధిగా సుమలత పోటీ చేసినప్పుడు కూడా దర్శన్ ప్రచారం చేశాడు.
మద్దతు బొమ్మైకు మాత్రమే..బీజేపీకు కాదు
కిచ్చా సుదీప్ బీజేపీ తరపున ప్రచారం చేస్తున్నారని, తనకు మద్దతు తెలిపారని స్వయంగా కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై మీడియా సమావేశంలో వెల్లడించారు. దాంతో బీజేపీలో చేరినట్టు, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తారనే ప్రచారం సాగింది. ఆ తరువాత సుదీప్ దీనిపై స్పష్టత ఇచ్చారు. బసవరాజ్ బొమ్మై నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా మద్దతు ఆయనకే. కష్టకాలంలో నాకు అండగా నిలిచినవారికి నేను పనిచేస్తాను. నేను రాజకీయాల్లోకి రావడం లేదు, ఎన్నికల్లో పోటీ చేయడం లేదని సుదీప్ స్పష్టం చేశారు. తాను మద్దతిచ్చేది కేవలం బసవరాజ్ బొమ్మైకు మాత్రమేనని..బీజేపీకు కాదని కూడా తెలిపారు. బసవరాజ్ బొమ్మై తరపున ప్రచారం, సభలు నిర్వహిస్తాను కానీ బీజేపీకు మద్దతు కాదని వివరణ ఇచ్చారు.
నాకు మద్దతు అంటే బీజేపీకు మద్దతు ఇచ్చినట్టేగా
అటు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా ఈ విషయంపై మరోలా స్పందించారు. ఆయన అంటే కిచ్చా సుదీప్ నాకు మద్దతు పలికారు. నాకు మద్దతు ఇస్తున్నారంటే బీజేపీకు మద్దతు ఇస్తున్నట్టే కదా కదా అని వ్యాఖ్యానించారు.
Also Read: Covid19 Cases in India: దేశంలో కరోనా కలకలం, 24 గంటల్లో 4వేలకుపైగా కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook