Covid19 Cases in India: దేశంలో కరోనా వైరస్ మరోసారి కలకలం రేపుతోంది. గత కొద్దిరోజులుగా పెరుగుతున్న కోవిడ్ 19 కేసులు ఆందోళన కల్గిస్తున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా ఏకంగా 4,435 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో 46 శాతం కేసులు పెరిగాయి.
కరోనా మహమ్మారి కేసులు దేశంలో మరోసారి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో 4,435 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 23,091కు పెరిగింది. గత 4-5 రోజులుగా రోజుకు 3 వేల కేసులు నమోదవుతున్న పరిస్థితి ఉంది. అలాంటిది ఒక్కసారిగా 4 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కల్గిస్తోంది. ముందురోజుతో పోలిస్తే 46 శాతం అధికం. మరోవైపు గత 24 గంటల్లో కరోనా కారణంగా 15 మంది మరణించారు. దేశంలో ఇప్పటి వరకూ కరోనా కేసులు 4.47 కోట్లకు చేరితే..మరణాల సంఖ్య 5,30,916కు చేరుకుంది.
ప్రస్తుతం దేశంలో కరోనా డెత్ రేటు 1.19 శాతంగా ఉంది. ఇప్పటి వరకూ 4,41,79,712 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహారాష్ట్రలో అత్యదికంగా 186 శాతం కేసులు పెరిగాయి. గత 24 గంటల్లో మహారాష్ట్రలో 711 కొత్త కేసులు నమోదు కాగా మొత్తం రాష్ట్రంలో 3,729 యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో కరోనా డైలీ పాజిటివ్ రేటు 3.38 శాతమైతే..వీక్లీ పాజిటివ్ రేటు 2.79 శాతంగా ఉంది. కరోనా కేసుల పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై మరోసారి దృష్టి సారించారు. దేశంలో ఇప్పటి వరకూ 220.66 కోట్ల డోసులు వ్యాక్సినేషన్ జరిగింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే జూన్ నాటికి కరోనా వైరస్ పీక్స్‌కు చేరుతుందనే హెచ్చరికలు నిజం కావచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Covid19 Cases in India: దేశంలో కరోనా కలకలం, 24 గంటల్లో 4వేలకుపైగా కేసులు