Kerala Governor Arif Mohammed Khan tests COVID-19 positive: న్యూఢిల్లీ: దేశంలో (India) లో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రముఖులు ఇలా అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ్మద్ ఖాన్‌ (Arif Mohammad Khan) కూడా క‌రోనావైర‌స్ బారిన పడ్డారు. తాజాగా ఆయనకు చేయించిన పరీక్షలో కరోనా పాజిటివ్‌గా తేలిందని కేరళ రాజ్‌భవన్ (Kerala Raj Bhavan) శనివారం ట్విట్ చేసి వెల్లడించింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే తనకు ల‌క్ష‌ణాలు క‌న్పించ‌డంతో ప‌రీక్ష‌లు చేయించ‌గా కరోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయినట్లు గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ వెల్లడించారని కేరళ రాజ్‌భ‌వ‌న్ ట్విట్ చేసింది. అయితే ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని గ‌వ‌ర్న‌ర్ తెలిపార‌ని పేర్కొంది. గ‌తవారం న్యూఢిల్లీలో త‌న‌ను క‌లిసిన‌వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, ముందుజాగ్ర‌త‌గా ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉండాల‌ని గవర్న ఆరిఫ్ మహ్మద్ సూచించారని రాజ్‌భవన్ ట్విట్‌లో తెలిపింది.  Also read: Baba ka Dhaba donation controversy: యూట్యూబర్‌‌పై చీటింగ్‌ కేసు


ఇదిలాఉంటే.. కేరళ కూడా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 4,73,468 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 1,640 మంది మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 83,208 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 3,88,504మంది ఈ మహమ్మారి నుంచి కోలుకున్నారు. Also read: Bihar Assembly Election 2020: బీహార్ తుది దశ పోలింగ్ ప్రారంభం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe