Lalu Prasad Yadav: బీహార్ మాజీ సీఎం లాలూకు బెయిల్.. కానీ
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
Lalu Yadav gets bail in fodder scam: పాట్నా: బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది. పశుగ్రాసం కుంభకోణం కేసులో శిక్ష అనుభవిస్తున్న రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు జార్ఖండ్ హైకోర్టు (Jharkhand High Court) బెయిల్ మంజూరు చేసింది. దాణా కుంభకోణానికి సంబంధించిన చైబాసా ట్రెజరీ కేసులో.. శుక్రవారం జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అయితే లాలూ జైలు నుంచి బయటకు రావడం మాత్రం కుదరదు. Also read: Bihar Assembly Election 2020: మహాకూటమి రథసారధిగా తేజస్వి యాదవ్
దుమ్కా ట్రెజరీ కేసు ఇంకా విచారణలో ఉన్నందున లాలూ ప్రసాద్ యాదవ్ ఇంకా జైలులోనే కొనసాగనున్నారు. అయితే చైబాసా ఖజానా అవినీతి కేసులో ఇప్పటికే లాలూ సగం శిక్షను అనుభవించారు. ఇంకా సగం శిక్ష పూర్తికావడానికి మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయని సీబీఐ జార్ఖండ్ కోర్టుకు నివేదించిన క్రమంలో.. జార్ఖండ్ ధర్మాసనం ఈ విధంగా ఆదేశాలు జారీ చేసింది. బీహార్‌లో రసవత్తరంగా సాగుతున్న ఎన్నికల సంగ్రామంలో లాలూకు బెయిల్ లభించినా.. మరో కేసు విచారణలో ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. Also read: Bihar Assembly election 2020: జేడీయూ, బీజేపీ మధ్య కుదిరిన ఒప్పందం
ఇదిలాఉంటే.. రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28, నవంబర్ 3,7 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. అక్టోబరు 10న ఫలితాలు వెలువడనున్నాయి. ఓ వైపు బీజేపీ, జేడీయూ కలిసి పోటీచేస్తుండగా.. మరోవైపు కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు పోటీచేస్తున్నాయి. ఇంకా ఎంఐఎం నేతృత్వంలోని థర్డ్ ఫ్రంట్ కూడా బరిలో ఉండగా.. శివసేన కూడా 50 సీట్లల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. Also read: Bihar Elections: 50 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఎన్నికలకు దూరంగా ఆ ముగ్గురు నేతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe