Aadhaar-Voter ID Link: ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సంస్కరణలు చేపట్టే విధంగా కేంద్రం తీసుకున్న నిర్ణయాలలో కీలక ముందడుగు పడింది. ఎన్నికల చట్టాల సవరణ బిల్లు 2021 (Election Laws (Amendment) Bill, 2021)కు సోమవారం లోక్​ సభ ఆమోదం తెలిపింది. న్యాయ శాఖ మంత్రి కిరణ్​ రిజిజు ఈ బిల్లును లోక్​సభలో ప్రవేశపెట్టారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నకిలీ ఓట్లను తొలగించడమే ప్రధాన లక్ష్యంగా ఈ బిల్లును (Election Reforms Bill) తీసుకొచ్చింది కేంద్రం. ఆధార్​తో ఓటర్​ ఐడీని అనుసంధానం చేసేందుకు వీలుంగా ఈ బిల్లును ప్రవేశపెట్టింది.


బిల్లులోని ముఖ్యాంశాలు..


ఓటర్ల జాబితాలో నకిలీలను తొలగించేందుకు ఈ బిల్లు ఉపయోగపడనుంది. ఆధార్​తో ఓటర్ ఐడీని అనుసంధానం చేయడం (Aadhaar link with Voter ID) ద్వారా నకిలీ ఓట్లకు చెక్​ పెట్టొచ్చని కేంద్రం భావిస్తోంది.


వ్యక్తిగత గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఐచ్ఛికంగానే ఆధార్​ ఓటర్ ఐడీ అనసంధాన ప్రక్రియ కొనసాగనున్నట్లు తెలుస్తోంది.


ఈ బిల్లు చట్ట రూపం దాల్చిన తర్వాత.. ఓటరు గుర్తింపు ధృవీకరణ కోసం ఆధార్​కు కోరేందుకు ఎన్నికల సంఘానికి అధికారాలు రానున్నాయి. కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకునే వారితో పాటు..ఇప్పటికే ఓటు హక్కు ఉన్న వారికి కూడా ఇది వర్తించనుంది.


ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు ప్రక్రియ..


ఏడాదికి నాలుగు సార్లు ఓటు హక్కు నమోదు ప్రక్రియను చెపట్టేందుకు కూడా ఈ బిల్లు వీలు కల్పించనుంది. ప్రస్తుతం ఏడాదికి ఒక సారి మాత్రమే ఓటు హక్కు నమోదు ప్రక్రియ జరుగుతోంది.


ఈ బిల్లును కాంగ్రెస్​ సహా విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రజల వ్యక్తిగత గోప్యతకు ఇది వ్యతిరేకమని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ క్రమంలో లోక్ సభ పలుమార్లు వాయిదా పడింది. ఆ తర్వాత సభలో గందరగోళం మధ్యే మంత్రి కిరణ్​ రిజిజు బిల్లుపై ప్రసంగించారు. స్పీకర్ ఓటింగ్ ప్రక్రియ ద్వారా బిల్లును పాస్ చేశారు.


Also read: IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్​లు రిజర్వ్​!


Also read: P.T. Usha: దిగ్గజ అథ్లెట్ పీటీ ఉషపై చీటింగ్ కేసు నమోదు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook