IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్​లు రిజర్వ్​!

Indian Railways: భారతీయ రైల్వే మహిళల భద్రత కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దూర ప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్​లు రిజర్వ్​ చేయనున్నట్లు తెలిపింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 19, 2021, 04:21 PM IST
  • మహిళల రక్షణ కోసం భారతీయ రైల్వే కీలక నిర్ణయం
  • దూరపు ప్రయాణాల ట్రైన్​లో మహిళలకోసం బెర్త్​లు రిజర్వ్​
  • వయసుతో సంబంధం లేకుండా వినియోగించుకునేలా వెసులుబాటు
IRCTC update: మహిళల రక్షణకు రైల్వే కీలక నిర్ణయం- ఆ ట్రైన్లలో బెర్త్​లు రిజర్వ్​!

Indian Railways: భారతీయ రైల్వే సేవలను మహిళలకోసం మరింత సురక్షితంగా చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దూరప్రయాణాలు చేసే రైళ్లలో మహిళలకోసం బెర్త్​లు రిజర్వ్ (Reserved berths for women)​ చేయనున్నట్లు ఇండియన్ రైల్వేస్​ ప్రకటించింది.

ఈ నిర్ణయం మహిళలు సురక్షితంగా (Women safety) ఎక్కువ దూరం ప్రయాణించేందుకు ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

ఈ విషయంపై మాట్లాడిన అశ్విని వైష్ణవ్​.. రైళ్లలో దూరప్రయాణం చేసే మహిళల సౌకర్యార్థం ప్రత్యేక బెర్త్​లతోపాటు.. సౌకర్యవంతమైన సదుపాయాలెన్నో కల్పించనున్నట్లు వెల్లడించారు.

అశ్విని వైష్ణవ్ చెప్పిన వివరాల ప్రకారం..గరీబ్​ రథ్​, రాజధాని, దురంతో, ఏసీ ఎక్స్​ప్రెస్​ ట్రైన్​లలోని స్లీపర్​కాల్స్​లో ఆరు బెర్త్​లు మహిళలకోసం రిజర్వ్ చేసి ఉంటాయి. వయసు బేధం లేకుడా మహిళలంతా ఈ బెర్త్​లను వినియోగించుకోవచ్చని వివరించారు.

ఇదే కాకుండా.. మహిళలు ఓ గ్రూప్​గా ప్రయాణిస్తున్నట్లయితే.. స్లీపర్​ కోచ్​లో వారందరికి కూడా కలిపి ఒకేసారి బెర్త్​లు బుక్ చేసుకోవచ్చని తెలిపింది రైల్వే శాఖ. ప్రతి స్లీపర్ కోచ్​లో కిందివైపు ఉండే 6-7 బెర్త్​లు మహిళలకోసం రిజర్వ్ చేసి ఉంటాయని వివరించింది. 3ఏసీ కోచ్​లో 4-5 లోవర్​ బెర్త్​లు రిజర్వ్​ చేసి ఉంటాయని పేర్కొంది. ఇక 2ఏసీలో 3-4 బెర్త్​లు రిజర్వ్​ కోసం కేటాయించనున్నట్లు వివరించారు.

మహిళ భద్రత కోసం..

మహిళా ప్రయాణికుల భద్రరత కోసం రైల్వే ప్రొటెక్షన్​ ఫోర్స్ (ఆర్​పీఎఫ్​), గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్​పీ), జిల్లాల పోలీసు శాఖలకు ప్రత్యేక సూచనలు చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.

Also read: Heart Breaking: మైనర్ బాలిక హార్ట్ బ్రేకింగ్ సూసైడ్ నోట్-లైంగిక వేధింపులతో ఆత్మహత్య

Also read: Andaman Covid-19 Vaccination: అండమాన్‌ దీవుల్లో 100శాతం వ్యాక్సినేషన్‌..తొలి కేంద్రపాలిత ప్రాంతంగా రికార్డు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News