P.T. Usha, six others booked in cheating case: భారత దిగ్గజ అథ్లెట్ పీటీ ఉష(P.T. Usha)పై చీటింగ్ కేసు(cheating case)నమోదైంది. మాజీ అథ్లెట్ జెమ్మా జోసెఫ్(Jemma Joseph) ఫిర్యాదు మేరకు ఉషపై కేసు నమోదు చేసినట్లు కోజికోడ్ పోలీసులు తెలిపారు. ఉషతో పాటు మరో ఆరుగురిపై సెక్షన్ ఐపీసీ 420 కింద కేసు నమోదైనట్లు వెల్లడించారు.
ఓ బిల్డర్‌తో కలిసి పీటీ ఉష తనను మోసం చేశారని జెమ్మా జోసెఫ్ ఆరోపించారు. పీటీ ఉష హామీతో కేరళలోని కోజికోడ్(Kozhikode)కు చెందిన ఓ బిల్డర్ నుంచి 1,012 చదరపు అడుగుల స్థలాన్ని తాను కొనుగోలు చేశానని చెప్పారు. ఈ స్థలం ఖరీదు రూ.46 లక్షలు కాగా.. విడతలవారీగా నగదు చెల్లించినట్లు వివరించారు. అయితే, స్థలాన్ని తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించకుండా బిల్డర్ ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. జోసెఫ్ ఫిర్యాదుపై కోజికోడ్ జిల్లా పోలీస్ చీఫ్ ఏవీ జార్జ్(A.V. George) సమగ్ర విచారణకు ఆదేశించారు. ఈ కేసును వెల్లాయిల్ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేశారు.
Also Read: Enjoy Rape Remarks: 'ఎంజాయ్ రేప్' కామెంట్స్‌పై నిర్భయ తల్లి రియాక్షన్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
P.T. Usha: రియల్ ఎస్టేట్ వివాదం: పీటీ ఉషపై చీటింగ్ కేసు