Covid-19: న్యూఢిల్లీ: దేశంలో ఇటీవల కాలంలో చాలామంది నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంతులు కరోనావైరస్ (Coronavirus) బారిన పడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడి ఆసుపత్రిలో చేరిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ( Shivraj Singh Chouhan)  బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. జూలై 25న సీఎం శివరాజ్ సింగ్‌కు కరోనా నిర్థారణ అయింది. అయితే వైద్యుల సూచన మేరకు ఆయన భోపాల్‌లోని చిరయు ఆసుపత్రిలో చేరి 11 రోజులపాటు చికిత్స అనంతరం కరోనా నుంచి కోలుకున్నారు. Also read: CM Shivraj Singh: నా దుస్తులు నేనే ఉతుక్కుంటున్నా..


డిశ్చార్జ్ అనంతరం వారం రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా డాక్టర్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌కు సూచించారు. అయితే తాను పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని, తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అవుతానని ఆయన ట్విట్టర్ ద్వారా రెండు రోజుల క్రితం వెల్లడించారు. Also read: Ram Mandir: భూమి పూజకు ముందు ముస్లిం పర్సనల్ లా బోర్డు అభ్యంతరకరమైన ట్వీట్