విషాదం: పెళ్లి తంతు ముగిసేలోపే వధువు మృతి
Bride dies in midst of wedding rituals | అగ్నిసాక్షిగా ఒక్కటైన ఆ జంట ఆనందంగా బరాత్ నడుమ ఇంటికి చేరుకోవాలనుకుంది. అంతలోనే విధి వక్రించింది. పెళ్లితంతు జరుగుతుండగానే వధువు చనిపోవడం రెండు కుటుంబాలలో విషాదాన్ని నింపింది.
Bride Dies In UP | అప్పటివరకూ రెండు కుటుంబాలు ఎంతో సంతోషంగా పెళ్లి వేడుకలో పాల్గొన్నాయి. అయితే విధి వక్రించింది. పెళ్లితంతు(Wedding Rituals) ముగిసేలోపే పెళ్లికూతురు కరోనా లక్షణాలతో(CoronaVirus Symptoms) చనిపోగా, వరుడి కుటుంబసభ్యులు నిరాశగా, బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్ జిల్లా థాథియా పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్‌పూర్వ గ్రామంలో చోటుచేసుకుంది. ఉదయాన్నే నిమ్మరసం తాగుతున్నారా.. ఇది తెలుసుకోండి
శుక్రవారం రాత్రి పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. వినిత, సంజయ్‌కి వివాహం నిశ్చయించారు. అనుకున్న ముహుర్తానికే పెళ్లి జరిగింది. అగ్ని సాక్షిగా వారు వివాహబంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి కార్యక్రమాలు జరుగుతుండగా వధువు అస్వస్థతకు గురై కుప్పకూలింది. ఊపిరాడటం లేదని చెప్పడంతో దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకెళ్తే కరోనా నెగటివ్ అని వస్తేనే జాయిన్ చేసుకుంటామన్నారు. భారీగా పెరిగిన బంగారం ధరలు.. వెండి పైపైకి
వధువు తంద్రి కిశోర బాథమ్ ఆమెను కాన్పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అయితే పరిస్థితి విషమించి పెళ్లికూతురు వినిత కన్నుమూసింది. పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ 112కు ఫోన్ చేయగా వినిత మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. శనివారం సాయంత్రం అంత్యక్రియలు జరిపించారు. వరుడు, అతడి కుటుంబసభ్యులు నిరాశగా, బాధతో ఇంటికి వెళ్లిపోయారు. జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..
Photos: రానా, మిహీకా బజాజ్ ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ షురూ